Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి తో స‌మావేశ‌మైన యూరోపియ‌న్ పార్ల‌మెంటు స‌భ్యుల


యూరోపియ‌న్ పార్ల‌మెంటు స‌భ్యులు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో న్యూ ఢిల్లీ లోని 7, లోక్ క‌ళ్యాణ్ మార్గ్ లో ఈ రోజు న స‌మావేశ‌మ‌య్యారు. వారు వారి యొక్క ప‌ద‌వీ కాలం ఆరంభం లోనే భార‌త‌దేశాన్ని సంద‌ర్శించ‌డం ద్వారా భార‌త్ తో వారి సంబంధాల కు ఇచ్చినటువంటి ప్రాముఖ్యాన్ని ప్ర‌ధాన మంత్రి మెచ్చుకొన్నారు.

యూరోపియ‌న్ యూనియ‌న్ తో భార‌త‌దేశం యొక్క సంబంధం ప్ర‌జాస్వామ్య విలువ‌లు మ‌రియు ఉమ్మ‌డి హితాల పై ఆధారపడి ఉన్నద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. నిష్పాక్షిక‌మైన‌టువంటి మ‌రియు స‌మ‌తుల్య‌మైన‌టువంటి బిటిఐఎ ప్ర‌భుత్వ ప్రాథ‌మ్యాల లో ఒక‌టి గా ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌పంచం అంశాల పైన మ‌రియు ప్రాంతీయ అంశాల పైన ఇయు తో బంధాన్ని బ‌లోపేతం చేసుకోవల‌సిన అవ‌స‌రాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి వివ‌రిస్తూ, ఉగ్ర‌వాదం తో పోరాడటానికి అంత‌ర్జాతీయ స్థాయి లో స‌న్నిహిత స‌హకారం ఎంత‌యినా ముఖ్య‌మని పేర్కొన్నారు. ఇంట‌ర్‌నేశ‌న‌ల్ సోల‌ర్ అల‌య‌న్స్ ఒక ప్ర‌పంచ భాగ‌స్వామ్యం రూపం లో ఎదుగుతున్నదని కూడా ఆయ‌న అన్నారు.

PM India

భార‌త‌దేశాన్ని సంద‌ర్శ‌ించవలసింది గా ప్ర‌తినిధివ‌ర్గం స‌భ్యుల కు ప్రధాన మంత్రి ఆహ్వానం పలుకుతూ, దేశం లోని జ‌మ్ము, క‌శ్మీర్ స‌హా వివిధ ప్రాంతాల కు వారు జ‌రిపే యాత్ర ఫ‌ల‌ప్ర‌దం అవుతుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. జ‌మ్ము, క‌శ్మీర్ ను వారు సంద‌ర్శించ‌నుండ‌టం జ‌మ్ము, క‌శ్మీర్ మరియు ల‌ద్దాఖ్ ప్రాంతాల ధార్మిక‌ మ‌రియు సాంస్కృతిక విభిన్న‌త్వాన్ని మెరుగైన రీతి లో అర్థం చేసుకొనే అవ‌కాశాన్ని కల్పించడమే కాకుండా ఆయా ప్రాంతాల లో అభివృద్ధి మ‌రియు ప‌రిపాల‌న ప్రాథ‌మ్యాల తాలూకు స్ప‌ష్ట‌మైన చిత్రాన్ని కూడా అందించగలదని పేర్కొన్నారు.

వ్యాపార నిర్వ‌హ‌ణ తాలూకు సౌల‌భ్యం స్థానాల లో భార‌త‌దేశం 2014వ సంవ‌త్స‌రం లో 142వ స్థానం గా ఉండ‌గా, ప్ర‌స్తుతం 63వ స్థానాని కి చేరుకొన్నద‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. భార‌త‌దేశం వంటి విశాల‌మైన, విభిన్న‌ వ‌యో వ‌ర్గాల తో కూడిన ఒక దేశం ఈ మేరకు సాధించిన పురోగ‌తి ఎంతో పెద్ద‌ది అని ఆయ‌న అన్నారు. పాల‌నా వ్య‌వ‌స్థ‌ లు ప్రస్తుతం ప్ర‌జ‌ల కు వారు ఆకాంక్షించిన దిశ లో ముందుకు సాగిపోయేందుకు వీలు కల్పిస్తున్నాయ‌ని ఆయ‌న చెప్పారు.

భార‌త‌దేశం లో అంద‌రికీ జీవ‌న సౌల‌భ్యాన్ని ప్రసాదించేందుకు ప్ర‌భుత్వం శ్ర‌ద్ధ వ‌హిస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి నొక్కి పలికారు. స్వ‌చ్ఛ్ భార‌త్‌, ఆయుష్మాన్ భార‌త్ ల‌తో సహా ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప్ర‌ధాన కార్య‌క్ర‌మాలు స‌ఫ‌లం కావ‌డాన్ని గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. నిర్దేశిత ప్రపంచ ల‌క్ష్యాని క‌న్నా అయిదు సంవ‌త్స‌రాల ముందుగానే, అంటే 2025వ సంవ‌త్స‌రం క‌ల్లా, క్ష‌య వ్యాధి ని నిర్మూలించాలని భార‌త‌దేశం వచనబద్ధురాలు అయింద‌ని ఆయ‌న పున‌రుద్ఘాటించారు. న‌వీక‌ర‌ణ యోగ్య శ‌క్తి ఉత్పాద‌న ను పెంపొందించుకోవడం, ఒకేసారి వినియోగించే ప్లాస్టిక్స్ ను నిరోధించడం దిశ గా ఉద్య‌మం స‌హా ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు, పర్యావరణ సంర‌క్ష‌ణ కు తీసుకొంటున్న చ‌ర్య‌ల ను గురించి కూడా ఆయ‌న పార్లమెంటేరియన్ లకు వివ‌రించారు.