ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో 2018 బ్యాచ్ కు చెందిన 126 మంది ఐపిఎస్ ప్రబేశనర్ లు నేడు న్యూ ఢిల్లీ లో సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి వారితో సంభాషిస్తూ, మన దేశం యొక్క అభ్యున్నతి కోసం సమర్పణ భావం తో అలుపెరుగక కృషి చేయాలని సూచించి యువ అధికారుల లో ఉత్సాహాన్ని నింపారు.
అధికారులు వారి రోజువారీ విధుల లో సమర్పణ భావాన్ని మరియు సేవా భావాన్ని ఇముడ్చుకోవాలని ప్రధాన మంత్రి సూచించారు. సాధారణ పౌరుల తో సంబంధాలు కలిగి ఉండడం పోలీసు బలగాల కు ముఖ్యం అని ఆయన స్పష్టం చేశారు. పోలీసు దళం పట్ల పౌరుల దృష్టి కోణాన్ని ప్రతి ఒక్క అధికారి అర్థం చేసుకోవాలని, పోలీసు బలగాన్ని పౌరుల కు అనుకూలమైంది గా, పౌరులు పోలీసు బలగం చెంత కు చేరే విధం గా కృషి చేయాలని ఆయన కోరారు.
ఐపిఎస్ ప్రబేశనర్ లతో జరిగిన ముఖాముఖి సమావేశం లో ప్రధాన మంత్రి పాలు పంచుకొని నేర నిరోధం పట్ల పోలీసు విభాగం శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. ఒక ఆధునిక పోలీసు బలగం యొక్క ఆవిర్భావం లో సాంకేతిక విజ్ఞానం తాలూకు ప్రాముఖ్యాన్ని ఆయన ఈ సందర్బం లో నొక్కి పలికారు.
ఆకాంక్షభరిత జిల్లాల పరివర్తన లో మరియు సామాజికం గా కూడా మార్పు ను తీసుకు రాగల ఉపకరణాల వలె పోలీసులు వారి పాత్ర ను నిర్వహించాలని ప్రధాన మంత్రి అన్నారు. 2018 బ్యాచ్ లో మహిళా ప్రబేశనర్ లు పెద్ద సంఖ్య లో ఉండడాన్ని ఆయన ప్రశంసించారు. పోలీసు బలగం లో మరింత మంది మహిళలు ఉండడం పోలీసు శాఖ పై సానుకూల ప్రభావాన్ని ప్రసరింప చేయడం తో పాటు జాతి నిర్మాణం లోనూ ఎంతో సకారాత్మకత కు దారి తీస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు.
అధికారుల భవిష్యత్తు ఉజ్వలం గా ఉండాలని ప్రధాన మంత్రి ఆకాంక్షించారు. అధికారులు వారి పట్ల వారు విశ్వాసాన్ని కలిగివుండాలని ఆయన చెప్పారు. ఆధికారిక శిక్షణ తో పాటు అంతశ్శక్తి మరియు ఆత్మ విశ్వాసం.. ఇవి రెండూ జతపడినప్పుడు రోజువారీ విధి నిర్వహణ లో ఎదరయ్యే సవాళ్ళ ను అధికారులు ఎదుర్కోవడం లో అండ లభిస్తుందని ఆయన అన్నారు.
**
Interacted with young police officers from the 2018 Batch of the IPS. We discussed a wide range of subjects relating to further enhancing the working of our police forces, including greater usage of technology. https://t.co/oReH9qpRR6 pic.twitter.com/wixTCcDXlC
— Narendra Modi (@narendramodi) October 9, 2019