Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి తో స‌మావేశ‌మైన సెంట్ విన్సెంట్ ఎండ్ గ్రెనెడైన్స్ ప్ర‌ధాని


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో సెంట్ విన్సెంట్ ఎండ్ గ్రెనెడైన్స్ ప్రధాని డాక్టర్ రాల్ఫ్ ఎవరార్డ్ గొన్జాల్విస్ నేడు స‌మావేశ‌మ‌య్యారు. సెంట్ విన్సెంట్ ఎండ్ గ్రెనెడైన్స్ ప్ర‌ధాని ఒక‌రు భార‌త‌దేశాన్ని సంద‌ర్శించ‌డం ఇదే మొదటి సారి. నిన్న‌టి రోజు న న్యూ ఢిల్లీ లో జ‌రిగిన ఉన్న‌త స్థాయి యునైటెడ్ నేశ‌న్స్ క‌న్వెన్శన్ ఆన్ కంబాటింగ్‌ డెజర్టిఫికేశన్ (యుఎన్‌సిసిడి) సమ్మేళనం లో కూడా శ్రీ గొన్జాల్విస్ పాలు పంచుకొన్నారు.

భార‌త‌దేశం పట్ల సెంట్ విన్సెంట్ ఎండ్ గ్రెనెడైన్స్ లోనే కాకుండా క‌రీబియ‌న్, ఇంకా లాటిన్ అమెరికన్ ప్రాంతాల‌ లో సైతం విస్తృత‌మైన స‌ద్భావ‌న ఉంద‌ని ప్ర‌ధాని శ్రీ గొన్జాల్విస్ ఈ సంద‌ర్భం గా గుర్తు కు తెచ్చారు. ఈ ప్రాంతం లో భార‌త‌దేశం అందిస్తున్న అభివృద్ధి పూర్వ‌క‌ స‌హ‌కారాన్ని ఆయ‌న ప్ర‌శంసించారు. అలాగే, ప్రాకృతిక విప‌త్తు లు సంభ‌వించిన‌పుడ‌ల్లా భార‌త‌దేశం స‌కాలం లో స‌హాయాన్ని అందిస్తోంద‌ని ఆయ‌న అన్నారు.

అంత‌ర్జాతీయ వేదిక ల‌తో స‌హా ఉభ‌య దేశాల మ‌ధ్య స‌న్నిహిత స‌హ‌కారం నెల‌కొంద‌ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గుర్తు చేశారు. ఐక్య రాజ్య స‌మితి భ‌ద్ర‌త మండ‌లి లో శాశ్వ‌త ప్రతిపత్తి కానటువంటి స‌భ్య‌త్వ దేశం గా ఎన్నికైన అత్యంత చిన్న దేశం అనే చారిత్రక కార్యసాధన ను సెంట్ విన్సెంట్ ఎండ్ గ్రెనెడైన్స్ ద‌క్కించుకొన్నందుకు ఆయ‌న అభినంద‌న‌లు తెలిపారు.

విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌ రంగం, సంస్కృతి రంగం, ఆర్థిక రంగం, విద్య‌ రంగం, శిక్ష‌ణ‌ రంగం, ఇంకా నైపుణ్యాభివృద్ధి రంగం సహా ఇరు దేశాలు తమ మధ్య గల ప‌ర‌స్ప‌ర స‌హ‌కారాన్ని మరింతగా పెంపొందింపచేసుకోవాల‌ని నేత‌లు అంగీకరించారు.

**