Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి తో సమావేశమైన‌ మాల్దీవ్స్ కు చెందిన‌ పీపుల్స్ మ‌జ్‌లిస్ స్పీక‌ర్ శ్రీ మొహ‌మద్ న‌శీద్


లోక్ స‌భ స్పీక‌ర్ మ‌రియు రాజ్య స‌భ చైర్‌ మ‌న్ ల సంయుక్త ఆహ్వానాన్ని అందుకొని భార‌త‌దేశాని కి విచ్చేసిన  మాల్దీవ్స్ కు చెందిన‌ పీపల్స్ మ‌జ్‌ లిస్ స్పీక‌ర్ శ్రీ మొహ‌మద్ న‌శీద్ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో న్యూ ఢిల్లీ లో ఈ రోజు న భేటీ అయ్యారు.

స్పీక‌ర్ శ్రీ న‌శీద్ కు ప్ర‌ధాన మంత్రి స్వాగ‌తం ప‌లుకుతూ, రెండు దేశాల పార్ల‌మెంటు ల మ‌ధ్య గ‌ల బంధం భార‌త‌దేశం-మాల్దీవ్స్ సంబంధం లో ఒక కీల‌క‌మైన భాగం గా ఉన్నద‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్శ‌న ఉభ‌య ప‌క్షాల మ‌ధ్య గ‌ల మైత్రీ సేతువులను బ‌ల‌ప‌ర‌చడం లో సహాయకారి కాగలద‌న్న విశ్వాసాన్ని ప్ర‌ధాన మంత్రి వ్య‌క్తం చేశారు.

ఈ సంవ‌త్స‌రం లో జూన్ లో మాలె ను తాను సంద‌ర్శించిన‌ప్పుడు పీపల్స్ మ‌జ్‌ లిస్ ను ఉద్దేశించి ప్ర‌సంగించిన విష‌యాన్ని ప్ర‌ధాన మంత్రి గుర్తు కు తెచ్చుకుంటూ, మాల్దీవ్స్ లో ప్ర‌జాస్వామ్యాన్ని బ‌లోపేతం చేయ‌డం కోసం మ‌రియు మాల్దీవ్స్ లో ప్ర‌జాస్వామ్యాన్ని గాఢ‌త‌రం చేయ‌డం కోసం స్పీక‌ర్ శ్రీ న‌శీద్ బ‌ల‌మైన నాయ‌క‌త్వాన్ని అందిస్తూ వస్తున్నారంటూ ప్ర‌శంసించారు.  ఒక స్థిర‌మైన‌టువంటి, స‌మృద్ధ‌మైన‌టువంటి మ‌రియు శాంతియుత‌మైన‌టువంటి మాల్దీవ్స్ ఆవిష్కారాని కి మ‌రియు స్నేహ‌శీలురైన మాల్దీవ్స్ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల ను నెర‌వేర్చ‌డాని కి మాల్దీవ్స్ ప్ర‌భుత్వం తో స‌న్నిహితం గా కృషి చేస్తూ ఉండాల‌న్న భార‌త‌దేశం వ‌చ‌న బ‌ద్ధ‌త ను ప్ర‌ధాన మంత్రి పున‌రుద్ఘాటించారు.

గ‌డ‌చిన సంవ‌త్స‌రం లో మాల్దీవ్స్ లో నూత‌న ప్ర‌భుత్వం ఏర్పడిన నాటి నుండి ఒక బ‌ల‌మైన భార‌త‌దేశం-మాల్దీవ్స్ సంబంధం కోసం నిరంత‌రాయం గా మ‌ద్ధ‌తు ను ఇస్తున్నందుకు గాను ప్ర‌ధాన మంత్రి కి స్పీక‌ర్ శ్రీ న‌శీద్ ధ‌న్య‌వాదాలు ప‌లికారు.  మాల్దీవ్స్ ప్ర‌జ‌ల సంక్షేమం కోసం మాల్దీవ్స్ లో అభివృద్ధి సంబంధిత స‌హ‌కారాత్మక కార్య‌క్ర‌మాల ను చేప‌ట్టినందుకు కూడా ప్ర‌ధాన మంత్రి కి ఆయ‌న ధ‌న్య‌వాదాలు ప‌లికారు.  మాల్దీవ్స్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ‘ఇండియా ఫ‌స్ట్’ విధానాని కి తన నిశ్చ‌ల‌ తోడ్పాటు ను ఆయ‌న పున‌రుద్ఘాటించారు.  ఇరు దేశాల మ‌ధ్య గల స్నేహ సంబంధాల ను మ‌రియు సౌభ్రాతృత్వ బంధాల ను మ‌రింత గా ప‌టిష్ట ప‌ర‌చ‌డం లో మాల్దీవ్స్ పార్ల‌మెంట‌రీ ప్ర‌తినిధి బృందం యొక్క భార‌తదేశ యాత్ర సహాయకారి కాగ‌ల‌ద‌ని పేర్కొన్నారు.  

**