Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి తో భేటీ అయిన తమిళ నాడు ముఖ్యమంత్రి

ప్ర‌ధాన మంత్రి తో భేటీ అయిన తమిళ నాడు ముఖ్యమంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ ఒ. పన్నీర్ సెల్వమ్ ఈ రోజు భేటీ అయ్యారు.

జల్లీకట్టూ పై సర్వోన్నత న్యాయస్థానం విధించిన నిషేధం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. జల్లీకట్టూకు ఉన్న సాంస్కృతిక ప్రాధాన్యాన్ని ప్రధాన మంత్రి అభినందిస్తూనే, ఈ వ్యవహారం ప్రస్తుతానికి కోర్టు విచారణలో ఉందని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొనే చర్యలకు కేంద్రం మద్దతివ్వగలదని చెప్పారు.

అంతే కాకుండా, రాష్ట్రంలోని అనావృష్టి పరిస్థితిని పరిష్కరించేందుకు సాధ్యమైనన్ని విధాలా సహాయాన్ని అందించడం జరుగుతుందని కూడా ముఖ్యమంత్రికి ప్రధాన మంత్రి హామీ ఇచ్చారు. కేంద్ర బృందాన్ని త్వరలోనే రాష్ట్రానికి పంపిస్తామని ఆయన తెలిపారు.

***

B