ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుని దౌత్య సలహాదారు శ్రీ ఫిలిప్ ఎటియన్ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు సమావేశమయ్యారు.
రక్షణ మరియు భద్రత రంగాలు సహా అన్ని రంగాలలో భారతదేశానికి, ఫ్రాన్స్‌కు మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం గురించి శ్రీ ఎటియన్ ఈ సందర్భంగా ప్రధాన మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ప్రధాన మంత్రి 2017 జూన్ లో తన ఫ్రాన్స్ పర్యటన విజయవంతం కావడం గురించి ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకొన్నారు.
భారతదేశం- ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి రక్షణ మరియు భద్రత రెండు ముఖ్య స్తంభాలు అని ప్రధాన మంత్రి అన్నారు. అన్ని రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలు వర్ధిల్లుతూ ఉండడాన్ని ఆయన ప్రశంసించారు.
ప్రెసిడెంట్ మాక్రాన్ వీలైనంత త్వరగా వీలు చూసుకొని భారతదేశానికి విచ్చేస్తే ఆయనకు స్వాగతం పలకాలని తాను ఎదురుచూస్తున్నానని కూడా ప్రధాన మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
***