Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి తో కింగ్‌డ‌మ్ ఆఫ్‌ మొరాకో సెక్ర‌ట‌రీ ఆఫ్ స్టేట్ ఇన్‌ చార్జ్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ర‌కియా ఎద‌ర్హ‌మ్ భేటీ


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో కింగ్‌డ‌మ్ ఆఫ్‌ మొరాకో యొక్క ప‌రిశ్ర‌మ‌, పెట్టుబ‌డి, వ్యాపారం, ఇంకా డిజిట‌ల్ ఎకాన‌మీ మంత్రిత్వ శాఖ లో సెక్ర‌ట‌రీ ఆఫ్ స్టేట్ ఇన్‌ చార్జ్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ గా ఉన్న ర‌కియా ఎద‌ర్హ‌మ్ ఈ రోజు భేటీ అయ్యారు.

మొరాకో రాజు గారి యొక్క శుభాకాంక్ష‌ల‌ ను ప్ర‌ధాన మంత్రి కి ఆమె అంద‌జేశారు. రాజు గారి తో తాను ఇది వ‌ర‌కు జ‌రిపిన స‌మావేశం గురించి ప్ర‌ధాన మంత్రి గుర్తుకు తెచ్చుకొని, రాజు గారు చ‌క్క‌ని ఆరోగ్యం తో క్షేమంగా ఉండాలంటూ ఆయ‌న‌ కు తాను శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అంతేకాకుండా మొరాకో ప్ర‌జ‌లు సుఖ శాంతుల‌ తో వ‌ర్ధిల్లాల‌ని కూడా ఆయ‌న ఆకాంక్షించారు.

గ‌డ‌చిన కొన్ని సంవ‌త్స‌రాలు గా ద్వైపాక్షిక స‌హ‌కారం లో మ‌రీ ముఖ్యంగా న్యాయ స‌హాయం, అంత‌రిక్షం మ‌రియు సైబ‌ర్ సెక్యూరిటీ రంగాల లో గ‌ణ‌నీయ‌మైన పురోగ‌తి చోటుచేసుకోవ‌డాన్ని గురించి ర‌కియా ఎద‌ర్హ‌మ్ ప్ర‌స్తావించారు. ఇరు దేశాల మ‌ధ్య చారిత్ర‌కం గా బ‌ల‌మైన బంధాలు ఏర్ప‌డ‌టాన్ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంసించారు. ప‌ర‌స్ప‌రం ప్ర‌యోజ‌నాలు ఇమిడి వున్న రంగాల లో ద్వైపాక్షిక స‌హ‌కారం గాఢ‌త‌రం కావడంతో పాటు మ‌రింత‌ గా బ‌ల‌ప‌డాల‌ని, ఆ దిశ‌ గా జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాల‌ను ప్ర‌ధాన మంత్రి స్వాగ‌తించారు. గుజ‌రాత్ రాష్ట్రం తో వ్యాపార పరంగా మ‌రియు పెట్టుబ‌డి ప‌రంగా మొరాకో సంబంధాల‌ ను ఏర్ప‌ర‌చుకోవ‌డం హ‌ర్ష‌ణీయ‌మ‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు.