ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన నాలుగో దశ లో భాగం గా జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఎ.. అంత్యోదయ అన్న యోజన – ప్రాధాన్యత కలిగిన కుటుంబాలు) పరిధి లోని 81.35 కోట్ల మంది వ్యక్తుల కు – వీరి లో ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డిబిటి) పరిధి లోకి వచ్చే లబ్ధిదారులు కూడా కలిసున్నారు- 5 నెలల పాటు అంటే 2021 జులై మొదలుకొని 2021 నవంబరు వరకు ప్రతి ఒక్క వ్యక్తి కి 5 కిలో ల వంతు న ఉచితం గా అదనపు ఆహారధాన్యాల ను ఇచ్చేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
టిపిడిఎస్ లో భాగం గా 81.35 కోట్ల మంది వ్యక్తుల కు 5 నెలల కాలానికి ప్రతి ఒక్కరి కి నెల కు 5 కిలోల వంతు న ఆహార ధ్యాన్యాల ను అదనం గా ఎలాంటి ధర అనేది లేకుండా మంజూరు చేయడానికి సంబంధించి 64,031 కోట్ల రూపాయల మేరకు ఆహార సబ్సిడి అవసరమవుతుందని అంచనా వేయడమైంది. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వైపు నుంచి ఎటువంటి తోడ్పాటు అనేది లేకుండా ఈ పథకానికి అయ్యే మొత్తం ఖర్చు ను భారత ప్రభుత్వం భరిస్తోంది. భారత ప్రభుత్వం ద్వారా ఆహార ధాన్యాల రవాణా, వాటి హ్యాండ్ లింగ్ , ఎఫ్ పిఎస్ డీలర్ ల మార్జిన్ తదితరాలకు గాను దాదాపు గా మరో 3,234.85 కోట్ల రూపాయల ను సైతం ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈ ప్రకారం గా, భారత ప్రభుత్వం ద్వారా కాబోయే మొత్తం అంచనా వ్యయం 67,266.44 కోట్ల రూపాయలు ఉంటుంది.
గోధుమలు/బియ్యం కేటాయింపు ను ఆహారం, ప్రజాపంపిణీ విభాగం నిర్ణయించనుంది. దీనికి తోడు, వర్షాలు, మంచు కురియడం వంటి ప్రతికూల వాతావరణ స్థితుల లో సప్లయ్ చైన్ మరియు కోవిడ్ వల్ల ఉత్పన్నమైన సమస్య ల కారణం గా నిర్వహణ సంబంధి అవసరాల కు తగినట్లుగా పిఎమ్‌జికెఎవై మూడో దశ, పిఎమ్‌జికెఎవై నాలుగో దశ లలో భాగం గా సరకు తరలింపు/పంపిణీ కాలాన్ని పొడిగించే అంశాన్ని కూడా ఆహారం, ప్రజాపంపిణీ విభాగమే ఖాయం చేసే అవకాశం ఉంది.
ఆహార ధాన్యాల పరం గా చూస్తే సుమారు గా 204 ఎల్ఎమ్‌టి ని తరలించవలసి రావచ్చు. ఈ అదనపు కేటాయింపు తో కరోనా వైరస్ కారణం గా ఆర్థికం గా చితికిపోయిన పేదల కు ఎదురయ్యే ఇక్కట్టులు తగ్గవచ్చు. రాబోయే అయిదు సంవత్సరాల లో ఏ పేద కుటుంబానికీ ఒడుదొడుకు ల కారణం గా ఆహార ధాన్యాల అలభ్యత తాలూకు బాధలను అనుభవించవలసిన స్థితి దాపురించదు.
***