Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రటరి గా ఉన్న శ్రీ నృపేంద్ర మిశ్రా పదవీబాధ్య‌త‌ ల నుండి వైదొల‌గ‌నున్నారు


ప్ర‌ధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రటరీ గా ఉన్న‌ శ్రీ నృపేంద్ర మిశ్రా త‌న కార్యభారం నుండి వైదొల‌గాల‌ని ఉంద‌న్న ఇచ్ఛ ను వ్య‌క్తం చేశారు. మరొక రెండు వారాల పాటు ప‌ద‌వి లో కొన‌సాగ‌వ‌ల‌సింది గా ప్ర‌ధాన మంత్రి ఆయ‌న కు సూచించారు. అలాగే, శ్రీ పి.కె. సిన్హా ను పిఎంఒ లో ఆఫీస‌ర్ ఆన్ స్పెశల్ డ్యూటీ పదవి లో ప్ర‌ధాన మంత్రి నియ‌మించారు. శ్రీ పి.కె. సిన్హా ఐఎఎస్ లో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ కాడ‌ర్ కు చెందిన 1977 బ్యాచ్ తాలూకు రిటైర్డ్ అధికారి.

ఒక ప్ర‌క‌ట‌న లో శ్రీ నృపేంద్ర మిశ్రా..

“గౌర‌వ‌నీయులు ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయ‌క‌త్వం లో దేశాని కి సేవ‌ చేసే భాగ్యం నాకు ద‌క్కింది. ఈ అవ‌కాశాన్ని నాకు ఇచ్చినందుకు మ‌రియు నా ప‌ట్ల సంపూర్ణ విశ్వాసాన్ని వ్య‌క్తం చేసినందుకు ఆయ‌న కు నేను మ‌న‌స్ఫూర్తి గా కృత‌జ్ఞుడి ని అయి ఉంటాను.

ఈ సంతృప్తిక‌ర‌మైన ప్ర‌స్థానం లో నేను అయిదు సంవ‌త్స‌రాల కాలాని కి పైబ‌డి ప్ర‌తి ఒక్క గంటా సంతోషదాయకమైన రీతి లో స‌మ‌ర్ప‌ణ భావం తో సేవ చేయ‌డాన్ని ఆస్వాదించాను. ఇప్పుడు నేను ప్రజల హితం కోసం మరియు దేశానికి మేలు చేయడానికి పాటు ప‌డేందుకు మ‌రింత ముందుకు పోయే తరుణం ఆసన్నం అయింది. నేను నాకు అండ‌దండ‌ల ను అందించిన ప్ర‌భుత్వం లోప‌లి స‌హ‌చ‌రులకు, ప్ర‌భుత్వం వెలుప‌లి స‌హ‌చ‌రుల కు, మిత్రుల‌ కు మ‌రియు నా కుటుంబ స‌భ్యుల కు ధ‌న్య‌వాదాలు తెలియజేస్తున్నాను. మ‌న దేశాన్ని ఒక ఉజ్వ‌లమైనటువంటి భ‌విష్య‌త్తు దిశ గా ముందుకు న‌డిపిస్తున్నటువంటి మ‌న ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గారు స‌ఫ‌ల‌త ను సాధించాల‌ని నేను ఆకాంక్షిస్తున్నాను..” అని పేర్కొన్నారు.