దావూదీ బోహ్రా వర్గ ప్రజల మతాధిపతి శ్రీ సయ్యద్ నా ముఫద్దలాల్ సైఫుద్దీన్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకొన్నారు. ఈ భేటీ కార్యక్రమంలో తొమ్మిది మందితో కూడిన ప్రతినిధి వర్గం శ్రీ సయ్యద్ నా ముఫద్దలాల్ సైఫుద్దీన్ వెంట వచ్చింది.
దావూదీ బోహ్రా వర్గం చేపడుతున్న సంఘ సంస్కరణ యత్నాలను ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు. ఈ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి అండ దండలు ఉన్నట్లు ఆయన చెప్పారు. అంతే కాకుండా, ముంబయిలోని భేండీ బజార్ ప్రాంతాన్ని స్మార్ట్ సిటీ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడంలో దావూదీ బోహ్రా వర్గం సాధించిన పురోగతిని కూడా ప్రధాన మంత్రి ప్రశంసించారు.
గంగా నది ఒడ్డుల వెంబడి నెలకొన్న పల్లెలలో మరుగుదొడ్లను నిర్మించే కృషిలో పాలు పంచుకోవలసిందిగా దావూదీ బోహ్రా వర్గానికి ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.