బోస్టన్ లోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎమ్ ఐ టి) అధ్యక్షుడు డాక్టర్ రాఫెల్ రీఫ్ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఈరోజు సమావేశమయ్యారు. విద్య, ఆరోగ్యం, నీరు, నవకల్పన రంగాలలో ఎమ్ ఐ టి చేస్తున్న కృషిని గురించి ఆయన ఈ సందర్భంగా ప్రధాన మంత్రికి వివరించారు. ఎమ్ ఐ టి కి వచ్చి విద్యార్థులతో, బోధన సిబ్బందితో ముచ్చటించవలసిందిగా ప్రధాన మంత్రిని డాక్టర్ రాఫెల్ రీఫ్ ఆహ్వానించారు.
స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా ఇంకా స్టార్టప్ ఇండియా కార్యక్రమాలకు ఎమ్ ఐ టి ప్రావీణ్యాన్ని అందజేసే అవకాశాలను పరిశీలించాలని డాక్టర్ రాఫెల్ రీఫ్ కు ప్రధాన మంత్రి సూచించారు.
ఎమ్ ఐ టి లోని అనుభవజ్ఞులైన బోధన సిబ్బంది గాని, లేదా విశ్రాంత అధ్యాపకులు గాని భారత దేశంలోని ఏదైనా విశ్వవిద్యాలయంలో కొన్ని నెలల పాటు విద్యా బోధనకు తరలి రావాలని ప్రధాన మంత్రి సలహా ఇచ్చారు. ఈ సలహా పై డాక్టర్ రాఫెల్ రీఫ్ హర్షం వ్యక్తం చేసి, ఈ విషయంలో తన వంతు సహాయాన్ని అందిస్తానని మాట ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో శ్రీ రతన్ టాటా కూడా పాల్గొన్నారు.
Dr. Rafael Reif, President of Massachusetts Institute of Technology & @RNTata2000 met PM @narendramodi. pic.twitter.com/XZG7Pyqral
— PMO India (@PMOIndia) January 28, 2016