ప్రధాన మంత్రికి పీఎంఎన్ఆర్ ఎఫ్ కింద రూ.5 కోట్ల డీడీని అందజేసిన హర్యానా ముఖ్యమంత్రి
09 Dec, 2015
హర్యానా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ ఈ రోజు ఢిల్లీలోని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పీఎం ఎన్ ఆర్ ఎఫ్ ) కింద ఐదు కోట్ల రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ ను ప్రధాన మంత్రికి అందజేశారు.