Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కి మరియు కంబోడియా ప్రధాని శ్రీ సమ్ దేక్ అక్కా మోహా సేనా పడీ టేకో హుణ్ సేన్ కు మ‌ధ్య టెలిఫోన్ ద్వారా జరిగిన సంభాష‌ణ‌


కంబోడియా ప్రధాని శ్రీ సమ్ దేక్ అక్కా మోహా సేనా పడీ టేకో హుణ్ సేన్ తో ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా సంభాషించారు. 
 
ఉభయ నేత లు విశ్వమారి కోవిడ్-19 ని గురించి చర్చించారు.  వారి వారి దేశాల లో ఉద్యోగాలు చేసుకొంటున్న ఒండొరుల పౌరుల కు ప్రస్తుతం అందిస్తున్న సహకారాన్ని కొనసాగించేందుకు, స్వదేశాని కి తిరిగి వెళ్లాలని కోరుకొంటున్న వారి కి తత్సంబంధితమైనటువంటి చేయూత ను ఇచ్చేందుకు ఇరువురు నేత లు తమ అంగీకారాన్ని వ్యక్తం చేశారు.  

ఆసియాన్ లో ప్రముఖ సభ్యత్వదేశం అయినటువంటి మరియు భారతదేశం తో నాగరకత పరం గాను, సంస్కృతి పరం గాను బంధం కలిగినటువంటి కంబోడియా తో సంబంధాన్ని మరింత బలపరచుకోవాలన్న భారతదేశం యొక్క వచనబద్ధత ను ప్రధాన మంత్రి ఈ సందర్భం లో వ్యక్తం చేశారు.  

ఐటిఇసి పథకం లో భాగం గా సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు మరియు మెకాంగ్-గంగ కోఆపరేశన్ ఫ్రేంవర్క్ లో భాగం గా శీఘ్ర ప్రభావ పథకాలు సహా ఇరు దేశాల లో సుదృఢమైనటువంటి అభివృద్ధియుత భాగస్వామ్యాన్ని నేత లు ఇరువురు సమీక్షించారు. 

భారతదేశం తో సంబంధాల కు కంబోడియా ఇస్తున్న ప్రాముఖ్యాన్ని గురించి కంబోడియా ప్రధాని నొక్కిచెప్పారు.  ప్రధాన మంత్రి శ్రీ మోదీ తన వంతు గా ఇదే విధమైన భావన ను ప్రకటిస్తూ, భారతదేశం అనుసరిస్తున్నటువంటి ‘యాక్ట్ ఈస్ట్ పాలిసి’లో కంబోడియా కు గల సముచిత పాత్ర ను గురించి ప్రస్తావించారు. 

**