ఈజిప్టు అధ్యక్షుడు మాన్య శ్రీ అబ్దెల్ ఫతహ్ ఎల్-సిసి తో ఈ రోజు న టెలిఫోన్ ద్వారా ప్రధాన మంత్రి శ్రీనరేంద్ర మోదీ మాట్లాడారు. ప్రపంచవ్యాప్త వ్యాధి ‘కోవిడ్-19’ వల్ల వివిధ దేశాల లో రూపుదాల్చుతున్న పరిస్థితుల ను గురించి నేత లు ఈ సందర్భం లో చర్చించారు. వారు తమ తమ దేశాల లో ప్రజానీకాన్ని పరిరక్షించేందుకు తమ ప్రభుత్వాలు తీసుకొంటున్న చర్యల ను ఒకరి దృష్టి కి మరొకరు తీసుకు వచ్చారు. ఒక దేశం యొక్క అనుభవాల ను మరొక దేశం తెలుసుకొంటూ ఉండటం వల్ల ఎంతో ప్రయోజనాన్ని పొందవచ్చని, అలాగే ఒకదేశం యొక్క ఉత్తమ అభ్యాసాల ను మరొక దేశం ఆచరణ లో పెట్టేందుకు కూడాను అవకాశం ఉంటుందంటూ వారు వారి యొక్క సమ్మతి ని వ్యక్తం చేశారు.
ఇటువంటి కష్ట కాలాల్లో ఔషధ సరఫరా లు లభ్యం అయ్యేటట్టు చూడడం లో భారతదేశం శాయశక్తుల తోడ్పాటు ను అందిస్తుంది అంటూ ఈజిప్టు అధ్యక్షుని కి ప్రధాన మంత్రి భరోసా ను ఇచ్చారు. ఈజిప్టు లో ఉంటున్న భారతీయ పౌరుల కు తోడ్పాటు ను అందిస్తున్నందుకు గాను అధ్యక్షుడు శ్రీ ఎల్-సిసి కి ప్రధాన మంత్రి ధన్యవాదాల ను కూడా తెలిపారు.
ఒక దేశం అనుభవాన్ని మరొక దేశాని కి వెల్లడించుకోవడం కోసం మరియు సన్నిహిత సమన్వయాన్ని నెలకొల్పుకోవడం కోసం తమ తమ దేశాల బృందాలు పరస్పరం సంప్రదింపులు జరుపుకొంటూ ఉంటాయని కూడా నేత లు ఉభయులూ అంగీకారానికి వచ్చారు.
Discussed on phone with President Abdel Fattah El-Sisi @AlsisiOfficial about the COVID-19 situation in India and Egypt. India will extend all possible support to Egypt’s efforts to control the spread of the virus and its impact.
— Narendra Modi (@narendramodi) April 17, 2020