Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన‌ మంత్రి కి మరియు ఫిలిపీన్స్ అధ్య‌క్షుని కి మ‌ధ్య టెలిఫోన్ ద్వారా జరిగిన సంభాష‌ణ‌


ఫిలిపీన్స్ అధ్య‌క్షుడు మాన్య శ్రీ రాడ్రిగో దుతెర్తే తో ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా సంభాషించారు. ఈ క్రమం లో విశ్వమారి కోవిడ్-19 వల్ల ఉత్పన్నమవుతున్న సవాళ్ల ను అధిగమించడం కోసం ఉభయ ప్రభుత్వాలు తీసుకొంటున్న చర్చల ను గురించి చర్చించారు.

నేత లు ఇరువురూ ప్రస్తుత ఆరోగ్య సంకట స్థితి లో వారి వారి దేశాల పౌరుల సంక్షేమాని కి పూచీ పడడం కోసం, అలాగే వారి ని స్వదేశానికి పంపించడం కోసం పరస్పరం అందజేసుకొంటున్న సహకారం పట్ల ప్రశంస ను వ్యక్తం చేశారు. ఫిలిపీన్స్ కు అత్యవసర ఔషధ ఉత్పత్తుల సరఫరా కై భారతదేశం చేపట్టిన చర్యల ను ఫిలిపీన్స్ అధ్య‌క్షుడు కూడా మెచ్చుకొన్నారు.

ప్రపంచవ్యాప్త వ్యాధి తో పోరాడడం లో ఫిలిపీన్స్ కు సాయపడేందుకు భారతదేశం యొక్క వచనబద్దత ను ప్రధాన మంత్రి ప్రకటించారు. సంభావిత టీకామందు ను ఒకసారి కనుగొనడం పూర్తి అయిన తరువాత ఆ మందు ను ఉత్పత్తి చేయగలిగినటువంటి సామర్థ్యం తో పాటు తక్కువ ధరల కే ఔషధ ఉత్పత్తుల ను తయారు చేసేందుకు భారతదేశం లో చక్కని వ్యవస్థ ఉందని, ఆ శక్తి సామర్థ్యాల ను యావత్తు మానవాళి యొక్క లబ్ధి కోసం మోహరించడాన్ని భారతదేశం కొనసాగిస్తుందని కూడా ఆయన నొక్కిచెప్పారు.

రక్షణ రంగ సహకారం తో పాటు ద్వైపాక్షిక సంబంధం తాలూకు అన్ని రూపాల లోను ఇటీవల కొన్ని సంవత్సరాలు గా అగపడుతున్నటువంటి ప్రగతి పట్ల నేతలు వారి యొక్క సంతృప్తి ని వ్యక్తం చేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతం లో ఫిలిపీన్స్ ను భారతదేశం ఒక వర్చువల్ పార్ట్ నర్ గా పరిగణిస్తోంది అని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు.

రాబోయే ఫిలిపీన్స్ జాతీయ దినాని కి గాను ఫిలిపీన్స్ ప్రజల కు మరియు అధ్య‌క్షుడు మాన్య శ్రీ దుతెర్తే కు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను తెలియజేశారు.