Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన‌ మంత్రి కి మరియు మొజాంబిక్ అధ్య‌క్షుడు మాన్య శ్రీ ఫిలిప్ జసింతొ న్యూసి కి మ‌ధ్య టెలిఫోన్ ద్వారా జరిగిన సంభాష‌ణ‌


మొజాంబిక్ అధ్య‌క్షుడు మాన్య శ్రీ ఫిలిప్ జసింతొ న్యూసి తో ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా సంభాషించారు.

కొవిడ్-19 విశ్వమారి స్థితి ప్రబలుతూ రువ్వుతున్నటువంటి సవాళ్ల ను గురించి ఇరువురు నేత లు ఈ సందర్భం లో చర్చించారు. ఆరోగ్య రంగ సంక్షోభ కాలం లో మొజాంబిక్ చేస్తున్న కృషి కి సమర్దన గా అత్యవసర ఔషధాల ను, చికిత్స సంబంధిత సరంజామా ను సమకూర్చడం సహా ఇతరత్రా మద్దతివ్వడానికి సైతం భారతదేశం సుముఖం గా ఉందని ప్ర‌ధాన‌ మంత్రి అన్నారు. స్వాస్థ్య రక్షణ మరియు ఔషధనిర్మాణ సంబంధి సరఫరా ల రంగం లో ఉభయ దేశాల మధ్య సన్నిహిత సహకారం నెలకొన్నందుకు గాను అధ్య‌క్షుడు శ్రీ న్యూసి తన ప్రశంస ను వ్యక్తం చేశారు.

మొజాంబిక్ లో భారతదేశం యొక్క పెట్టుబడులు మరియు అభివృద్ధి ప్రధాన పథకాలు సహా ఇతర ముఖ్యమైన అంశాల ను గురించి నేతలు ఇద్దరూ చర్చించారు. మొజాంబిక్ లోని బొగ్గు మరియు సహజ వాయువు రంగాల లో పెద్ద పాత్ర ను పోషించడాని కి భారతదేశ కంపెనీ లు ముందుకు వచ్చిన సంగతి ని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఆఫ్రికా తో భారతదేశం యొక్క సమగ్ర భాగస్వామ్యం లో మొజాంబిక్ ఒక ప్రముఖ స్తంభం గా నిలబడి ఉందన్న విషయాన్ని అంగీకరించారు.

రక్షణ మరియు భద్రత రంగాల లో ద్వైపాక్షిక సహకారం అధికం అవుతుండటం పట్ల నేత లు సంతృప్తి ని వ్యక్తం చేశారు. మొజాంబిక్ ఉత్తరాది ప్రాంతాల లో ఉగ్రవాద సంబంధిత ఘటన ల పట్ల అధ్య‌క్షుడు శ్రీ న్యూసి వెలిబుచ్చిన ఆందోళన లో ప్రధాన మంత్రి తాను కూడా పాలుపంచుకొంటూ, మొజాంబిక్ భద్రత దళాలు మరియు రక్షకభట బలగాల సామర్థ్యాన్ని పెంపొందించడానికి సాయపడటం తో పాటు సాధ్యమైన అన్ని విధాలు గాను మద్దతు ను అందించడానికి సిద్దమని పేర్కొన్నారు.

మొజాంబిక్ లో భారత మూలాలు కలిగిన సముదాయం తో పాటు అక్కడ ఉంటున్న భారతీయుల భద్రత కు మరియు రక్షణ కు మొజాంబిక్ అధికారిగణం పాటుపడుతున్నందుకు ప్రధాన మంత్రి ప్రత్యేకం గా ధన్యవాదాలు పలికారు.

వర్తమాన ప్రపంచవ్యాప్త వ్యాధి నేపథ్యం లో సహకారాని కి మరియు సహాయాని కి ఆస్కారం ఉండే మరిన్ని అవకాశాల ను అన్వేషించడం కోసం ఇరు దేశాల అధికారులు పరస్పరం సమాలోచన లను కొనసాగించాలి అనే అంశం పై ఉభయ నేత లు వారి యొక్క సమ్మతి ని వ్యక్తం చేశారు.