Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీకి, యూరోపియ‌న్ కౌన్సిల్ అధ్య‌క్షుడు చార్లెస్ మైఖేల్ మ‌ధ్య ఫోన్ సంభాష‌ణ‌


ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌న‌రేంద్ర‌మోదీ ఈరోజు యూరోపియ‌న్ కౌన్సిల్ అధ్య‌క్షుడు హిజ్ ఎక్సలెన్సీ మైఖేల్ చార్లెస్ పోన్ అందుకున్నారు.

ఇరువురు నాయ‌కులు ఇండియా, యూరోపియ‌న్ యూనియ‌న్‌లో కోవిడ్‌-19 ప‌రిస్థితి, స్పంద‌న‌ల‌ను గురించి చ‌ర్చించారు. కోవిడ్ మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో అత్యావ‌శ్య‌క ఫార్మాసూటిక‌ల్ ఉత్ప‌త్తుల స‌ర‌ఫ‌రా తోస‌హా ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం అందించుకోవ‌డం ప‌ట్ల వారు అభినంద‌నలు తెలిపారు.

ఆరోగ్యం ఆర్థిక రంగంపై కోవిడ్ -19 ప్ర‌భావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవ‌డానిఇక‌ ప్రాంతీయ , ప్రపంచ స్థాయి సమన్వయం ప్రాముఖ్యతను వారు గుర్తించారు.

భారత్-ఇయు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తమ నిబద్ధతనుఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. తదుపరి భారత-ఇయు శి్‌ఖ‌రాగ్ర‌ సమావేశానికి తమ ఎజెండాను సిద్ధం చేయడానికి తమ అధికారులు కలిసి పనిచేస్తారని వారు అంగీకరించారు.

కోవిడ్ సంక్షోభం స‌మ‌యంలోనూ, అలాగే కోవిడ్ అనంతర స‌మ‌యంలోనూ ఇందుకు సంబంధించిన విష‌యాల‌పై సన్నిహిత సంబంధాలు కొన‌సాగించ‌డానికి ఇరువురు నాయకులు అంగీకరించారు.