ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్లో భూటాన్ ప్రధానమంత్రి శ్రీ డాక్టర్ లోటే షెరింగ్ తో ఫోన్ లో మాట్లాడారు. కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలొ ప్రాంతీయంగా నెలకొన్న పరిస్థితులను వారు ఉభయులూ చర్చించారు. కోవిడ్ -19 నియంత్రణకు తమ తమ దేశాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను వారు చర్చించారు. భూటాన్ రాజు డాక్టర్ షెరింగ్ ముందుండి,కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు నాయకత్వం వహించిన తీరుకు ప్రధాని ఆయనకు అభినందించారు.
ప్రాంతీయస్థాయిలో కోవిడ్ -19 వ్యతిరేక కోఆర్డినేషన్‌ను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి నాయకత్వం వహిస్తున్నందుకు డాక్టర్ షెరింగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఒకవైపు భారత్ వంటి పెద్ద, క్లిష్టమైన దేశంలో కోవిడ్ మహమ్మారిపై పోరాటం చేస్తూనే, ప్రాంతీయ స్థాయిలో కో ఆర్డినేషన్‌కు నాయకత్వం వహించడం పట్ల ప్రధానమంత్రిని షెరింగ్ అభినందించారు.
సార్క్ దేశాల నాయకుల మధ్య మార్చి 15 న అంగీకరించిన ప్రత్యేక ఏర్పాట్లను అమలు చేయడంలో సాధించిన పురోగతిపై ఇరువురు నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా ఉన్న భారత-భూటాన్ సంబంధాలు, వాటి ప్రత్యేక స్వభావాన్ని ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
కోవిడ్ మహమ్మారి కి సంబంధించి ఆరొగ్య, ఆర్థిక ప్రభావం భూటాన్‌పై కనిష్టస్థాయలో ఉండేలా భూటాన్‌కు భారతప్రభుత్వం సాధ్యమైనంత సహాయం అందిస్తుందని ప్రధానమంత్రి ఆయనకు హామీ ఇచ్చారు. హిజ్ మెజెస్టి ది కింగ్, లియోన్చెన్ డాక్టర్ షెరింగ్ మరియు డ్రూక్ యుల్ యొక్క స్నేహపూర్వక ప్రజలందరి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం ప్రధానమంత్రి తన శుభాకాంక్షలు తెలిపారు
భూటాన్ రాజు డాక్టర్షెరింగ్ మంచి ఆరోగ్యంతో ఉండాలని, డ్రుక్ యుల్ స్నేహపూర్వక ప్రజలందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
Exchanged thoughts with @PMBhutan Dr. Lotay Tshering on the evolving COVID-19 situation in our region. His Majesty The King and Lyonchhen are leading Bhutan's efforts admirably. India will stand by our close friend and neighbour in fighting the effects of the pandemic.
— Narendra Modi (@narendramodi) April 16, 2020