ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్‌లోని 6.1 లక్షల మంది లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ (పిఎంఎవై-జి) కింద జనవరి 20,2021 మధ్యాహ్నం 12 గంటలకు ఆర్ధిక సహాయాన్ని వీడియో కాన్ఫరెన్సు ద్వారా విడుదల చేయనున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ సహాయం కింద 5.30 లక్షల లబ్దిదారులకు తొలివిడత వాయిదాను విడుదల చేస్తారు. అలాగే ఇప్పటికే పిఎంఎవై-జికింద తొలి విడత వాయిదా అందుకున్న వారికి రెండో విడత ఆర్ధిక సహాయాన్ని 80 వేల మంది లబ్ధిదారులకు అందజేయనున్నారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్
2022 నాటికి అందరికీ గృహాలు అని ప్రధానమంత్రి శంఖం పూరించారు. ఇందుకు 2016 నవంబర్ 20న ఫ్లాగ్‌షిప్ కార్యక్రమా్ని ప్రారంభించారు. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా ఈ పథకం కింద 1.26 కోట్ల ఇళ్లను నిర్మించారు. పి.ఎం.ఎవై లబ్దిదారులకు నూరుశాతం గ్రాంటు కింద 1.20 లక్షలు ( మైదాన ప్రాంతంలో), 1.30 లక్షలు ( కొండ రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, క్లిష్టమైన ప్రాంతాలు, జమ్ము కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం, లద్దాక్ ,ఐఎపి, ఎల్‌డబ్ల్యుఇ జిల్లాలకు) ఇస్తారు
.పిఎంఎవై-జి లబ్ధిదారులు యూనిట్ సహాయంతోపాటు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
(ఎంజిఎన్ఆర్ ఇ జిఎస్) కింద నైపుణ్యం లేని కార్మికుల వేతనాలు.స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ , ఎంజిఎన్ఆర్ ఇజిఎస్ ఇతర ప్రత్యేక నిధుల కింద టాయిలెట్ల నిర్మాణానికి రూ 12,000లు అందజేస్తారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలకు చెందిన పథకాలతో ప్రధానమంత్రి ఉజ్వల పథకం , విద్యుత్ కనెక్షన్, సురక్షిత మంచినీటి పథకం, జల్‌జీవన్ మిషన్ కింద సురక్షిత మంచినీటి పథకాన్ని అనుసంధానం చేసేందుకు ఏర్పాటు ఉంది.
***