Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన‌మంత్రిశ్రీ న‌రేంద్ర మోదీ ఫిబ్ర‌వ‌రి 11,2019న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బృందావ‌న్ సంద‌ర్శించ‌నున్నారు.అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్ వారు 300 కోట్ల భోజ‌నాలు పెట్టినందుకు సూచిక‌గా ఒక ఫ‌ల‌కాన్ని బృందావ‌న్ , చంద్రోద‌య మందిర్‌లో ప్ర‌ధాన‌మంత్రి ఆవిష్క‌రించ‌నున్నారు.


అనంత‌రం ప్ర‌ధాన‌మంత్రి 3వ బిలియ‌న్ భోజ‌నాన్ని వివిధ‌పాఠ‌శాల‌ల‌కు చెందిన అణ‌గారిన వ‌ర్గాల‌పిల్ల‌ల‌కు పెట్ట‌నున్నారు. అనంత‌రం ప్ర‌ధాని ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వారినుద్దేశించి ప్ర‌సంగిస్తారు.
ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి ఇస్కాన్ ఆచార్య‌లు శ్రీ శ్రీ‌ల‌ప్ర‌భుపాద విగ్ర‌హానికి పుష్పాంజ‌లి ఘ‌టించ‌నున్నారు.
అక్ష‌య‌పాత్ర పౌండేష‌న్ 3 బిలియ‌న్‌భోజ‌నాలు పెట్టినందుకు గుర్తుగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు.
నేప‌థ్యం:
మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం అమ‌లులో భాగ‌స్వామిగా అక్ష‌య‌పాత్ర కీల‌క సేవ‌లు అందిస్తున్న‌ది. గ‌త 19 సంవ‌త్స‌రాలుగా అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్ మ‌ధ్యాహ్న భోజ‌న కార్య‌క్ర‌మంకింద 12 రాష్ట్రాల‌లో ని 14,702 పాఠ‌శాల‌ల‌కు సంబంధించిన 1.76 మిలియ‌న్ల మంది పిల్ల‌ల‌కు భోజ‌నాన్ని అందిస్తున్న‌ది. 2016లో అక్ష‌య‌పాత్ర 2 బిలియ‌న్ భోజ‌నాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని అప్ప‌టి రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీ స‌మ‌క్షంలో కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది.
ఈ ఫౌండేష‌న్ మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి మంత్రిత్వ‌శాఖ (ఎం.హెచ్‌.ఆర్‌.డి), సంబంధిత రాష్ట్ర‌ప్ర‌భుత్వాల‌తో స‌న్నిహిత సంబంధం క‌లిగి ఉండి, పిల్ల‌ల‌కు నాణ్య‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన‌, పుష్టిక‌ర‌మైన ఆహారాన్ని ల‌క్ష‌లాది మంది పిల్ల‌ల‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది.
మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం ప్ర‌పంచంలోనే ఈ త‌ర‌హా అతిపెద్ద కార్య‌క్ర‌మం. పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల చేరిక పెర‌గ‌డానికి, వారిహాజ‌రు శాతం పెర‌గ‌డానికి, వారు విద్య‌ను కొన‌సాగించ‌డానికి, 6-14 సంవ‌త్స‌రాల మ‌ధ్య‌గ‌ల బ‌డిఈడు పిల్ల‌ల‌ ఆరోగ్యం మెరుగుప‌డ‌డానికి ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంది.
2018అక్టోబ‌ర్ 24న ప్ర‌ధాన‌మంత్రి సెల్ఫ్ 4 సొసైటీ యాప్‌ను న్యూఢిల్లీలో ప్రారంభిస్తూ అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్ గురించి ప్ర‌స్తావించారు.
అక్ష‌య‌పాత్ర ఒక సామాజిక స్టార్ట‌ప్ అని, పాఠ‌శాల విద్యార్థుల‌కు ఆహారాన్ని అందించే సామాజిక ఉద్య‌మంగా అది మారింద‌ని ప్ర‌ధానిఅన్నారు.