Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాని స్వాతంత్య్ర దినోత్స‌వ ప్ర‌సంగం ముఖ్యాంశాలు

ప్ర‌ధాని స్వాతంత్య్ర దినోత్స‌వ ప్ర‌సంగం ముఖ్యాంశాలు

ప్ర‌ధాని స్వాతంత్య్ర దినోత్స‌వ ప్ర‌సంగం ముఖ్యాంశాలు


ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ భార‌త 70వ స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఎర్ర‌కోట బురుజుల పై నుంచి జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఆయ‌న ప్ర‌సంగంలోని ముఖ్యాంశాలు

1. ఈ ప్ర‌త్యేక రోజున‌ 125 కోట్ల మంది భార‌త ప్ర‌జ‌ల‌కు, విదేశాల్లో నివ‌సిస్తున్న భార‌తీయ సంత‌తి ప్ర‌జ‌ల‌కు నా అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. ఈ స్ఫూర్తి రానున్న కాలంలో ప్ర‌గ‌తిలో మ‌నం మ‌రిన్ని మెట్లు ఎక్క‌డానికి దోహ‌ద‌ప‌డాల‌ని ఆకాంక్షిస్తున్నాను.

2. ఈ సంద‌ర్భంగా మ‌హాత్మాగాంధీ, స‌ర్దార్ ప‌టేల్‌, పండిట్ నెహ్రూతో స‌హా దేశ స్వాతంత్య్ర సాధ‌న‌కు జీవితాల‌ను త్యాగం చేసిన ఎంద‌రో త్యాగ ధ‌నుల‌ను మ‌నం స్మ‌రించుకుందాం.

3. భార‌త దేశం ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న మాట వాస్త‌వం. కానీ, వాట‌న్నింటికీ ప‌రిష్కారాలు సాధించ‌గ‌ల స‌మ‌ర్థ‌త‌ మ‌న‌కు ఉంది.

4. ఈ రోజు ప్ర‌త్యేకంగా కార్య‌క్ర‌మాల క‌న్నా, కార్యాచ‌ర‌ణ గురించి ఎక్కువ‌గా మాట్లాడాల‌నుకుంటున్నాను.

5. గ‌తంలో ప్ర‌భుత్వాల‌పై ప్ర‌జ‌ల‌కు ఎన్నో అనుమానాలు ఉండేవి. కానీ, ఈ రోజు వాటి స్థానంలో ఆశ‌లు వ‌చ్చి చేరాయి.

6. స్వ‌రాజ్యాన్ని సురాజ్యంగా మార్చ‌వ‌ల‌సిన బాధ్య‌త మ‌నంద‌రి మీదా ఉంది. త్యాగాలు, క్ర‌మ‌శిక్ష‌ణ‌, దృఢ సంక‌ల్పం లేనిదే ఇది సాధ్యం కాదు.

7. ఈ రోజు నేను విధానాల క‌న్నా భ‌విష్య‌త్ దృక్కోణం పైన‌, ప‌నుల్లో వేగం క‌న్నా పురోగ‌తిలో అనుభ‌వాల పైన మాట్లాడాల‌నుకుంటున్నాను.

8. సురాజ్యం అంటే స‌గ‌టు జీవి పురోగ‌తి. ప్ర‌జ‌ల అవ‌స‌రాల పై అవ‌గాహ‌న ఉన్న ప్ర‌భుత్వం, ప్ర‌జ‌ల‌ ఆశ‌లు. సురాజ్య సాధ‌న‌కు బాధ్య‌త‌, బాధ్యాతాయుత ధోర‌ణి కీల‌కం.

9. ప్ర‌జ‌లు, ప్ర‌త్యేకించి మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవులు ఆదాయ‌పుప‌న్ను అధికారులంటే భ‌య‌ప‌డే ప‌రిస్థితిని మార్చాల‌న్న‌దే మా ఆకాంక్ష‌.

10. 2 కోట్ల మంది ప్ర‌జ‌లు దేశంలో పాస్ పోర్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేశారు. నిరుపేద‌లు కూడా ఈ రోజు ఒక‌టి రెండు వారాల్లో పాస్ పోర్టు పొంద‌గ‌లుగుతున్నారు.

11. భార‌త్ లో వ్యాపారం చేయాల‌ని ఆశించే ప్ర‌తి ఒక్క వ్యాపార‌వేత్త త‌న వ్యాపారాన్ని న‌మోదు చేయ‌డానికే క‌నీసం 6 నెల‌లు వేచి ఉండాల్సిన ప‌రిస్థితి గ‌తంలో ఉండేది. మా ప్ర‌భుత్వం ఆ విధానాల‌ను పూర్తిగా స‌ర‌ళీక‌రించింది. ఒక జులై నెల‌లోనే 900 రిజిస్ట్రేష‌న్లు జ‌రిగాయి.

12. 9 వేల‌కు పైగా గ్రూప్ -సి, గ్రూప్‌-డి ఉద్యోగాల‌కు ఇంట‌ర్వ్యూలు ర‌ద్దు చేశాం.

13. గ‌త 7 ద‌శాబ్దాల కాలంలో ప్ర‌జ‌ల అంచ‌నాలు ఎంత‌గానో మారాయి. విధానాల ప్ర‌క‌ట‌న‌, బ‌డ్జెట్ కేటాయింపులు మాత్ర‌మే వారిని సంతృప్తిప‌ర‌చ‌డం లేదు. క్షేత్ర‌స్థాయిలో ఫ‌లితాలు చూపించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

14. ఇంత‌కుముందు రోజుకు 55 నుంచి 77 కిలో మీట‌ర్ల గ్రామీణ రోడ్ల నిర్మాణం మాత్ర‌మే జ‌రిగేది. ఈవేళ ప్ర‌తి రోజూ 100 కిలో మీట‌ర్ల రోడ్లు నిర్మిస్తున్నాం.

15. ఒక జాతి, ఒక గ్రిడ్‌, ఒకే ధ‌ర సూత్రాన్ని మేం ఆచ‌ర‌ణ‌లోకి తెచ్చాం.

16. పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల‌కు మేం అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.

17. సౌర విద్యుత్‌లో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో 116 శాతం వృద్ధిని సాధించాం.

18. గతంలో 30 నుంచి 35 వేల కిలో మీట‌ర్ల ట్రాన్స్ మిష‌న్ లైన్ల నిర్మాణం జ‌రిగేది. ఈ రోజు దాన్ని 50 వేల కిలో మీట‌ర్ల‌కు పెంచాం.

19. గ‌త 60 సంవ‌త్స‌రాల కాలంలో 14 కోట్ల మందికి వంట గ్యాస్ అందుబాటులోకి వ‌చ్చింది. నేడు 7 నెల‌ల కాలంలోనే 4 కోట్ల మంది వంట గ్యాస్ క‌నెక్ష‌న్లు పొందారు.

20. నిరాశ‌వ‌హ దృక్ప‌థాన్ని మ‌నం పార‌దోలాల్సి ఉంది. అది చేయ‌గ‌లిగితే మ‌న‌కు అపార‌మైన శ‌క్తి వ‌స్తుంది. ప్ర‌జ‌లు అసాధ్యంగా భావించిన‌దాన్ని సుసాధ్యం చేయ‌గ‌ల‌మ‌నేందుకు 21 కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు సంస్థాగ‌త రుణాలు అందుబాటులోకి తేవ‌డ‌మే తార్కాణం.

21. విద్యుత్ సౌక‌ర్యానికి నోచుకోని గ్రామాలు 18 వేలు ఉండ‌గా, ఈ రోజు వాటిలో 10 వేల‌కు పైగా గ్రామాల‌కు విద్యుత్ వెలుగులు విస్త‌రించాయి. వారిలో చాలా మంది ఈ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను ఎంతో ఆనందంగా వీక్షిస్తున్నార‌ని నాకు స‌మాచారం అందింది.

22. ఢిల్లీకి కేవ‌లం 3 కిలో మీట‌ర్ల దూరంలో ఉన్న హ‌త్రాస్ అనే గ్రామానికి విద్యుత్ వ‌స‌తి అందుబాటులోకి రావ‌డానికి 7 ద‌శాబ్దాలు ప‌ట్టింది.

23. కేవ‌లం 50 రూపాయ‌ల ధ‌ర‌కే ప్ర‌భుత్వం ఎల్ ఇ డి బ‌ల్బుల‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెచ్చింది.

24. ఇరాన్‌, అఫ్గ‌నిస్తాన్‌, భార‌త్ ఒక‌రితో ఒక‌రు చేరువై చాబ‌హార్ పోర్టును నిర్మించ‌గ‌లుగుతున్నాయి. అసాధ్యం సుసాధ్య‌మ‌నేందుకు ఇది కూడా ఒక ఉదాహ‌ర‌ణే.

25. ద్ర‌వ్యోల్బ‌ణం 6 శాతం దాట‌కుండా మేం ప‌గ్గాలు వేయ‌గ‌లిగాం. దేశం రెండు వ‌రుస దుర్భిక్షాల‌తో అల్లాడిపోయింది. ప‌ప్పు దినుసుల ఉత్ప‌త్తి అత్యంత ఆందోళ‌నక‌రంగా మారింది. అయినా మేం ప‌రిస్థితిని అదుపులోకి తీసుకురాగ‌లిగాం. గ‌త ప్ర‌భుత్వాల‌తో పోలిస్తే స‌గ‌టు జీవికి ఆహారం భారం కాకుండా ఉండేందుకు మేం తీసుకున్న చ‌ర్య‌లు అపారం.

26. గురు గోవింద సింగ్ 350వ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న మాట‌లు ఇక్క‌డ ఉద‌హ‌రిస్తున్నాను. “ఇత‌రుల‌కు సేవ చేయ‌ని ఎవ‌రైనా త‌మ చేతులు ప‌విత్ర‌మైన‌వ‌ని ఎలా ప‌రిగ‌ణించ‌గ‌ల‌రు” అని ఆయ‌న ప్ర‌శ్నించారు. మ‌న రైతులు త‌మ చ‌ర్య‌ల‌తో ఆ సిద్ధాంతాన్ని ఆచ‌ర‌ణ‌లో చూపారు. వ‌రుస దుర్భిక్షాలు పీడిస్తున్నా వారు గ‌తంతో పోలిస్తే ఒక‌టిన్న‌ర రెట్లు అధికంగా ప‌ప్పు దినుసులు పండించారు.

27. మ‌న శాస్త్రవేత్త‌లు అధిక దిగుబ‌డి తెచ్చే 171 ర‌కాల విత్త‌నాలు త‌యారుచేయ‌డంవ‌ల్ల మెరుగైన ఉత్ప‌త్తిని సాధించ‌గ‌లిగాం. ఇందుకు వారిని అభినందిస్తున్నాను. ఎరువుల కొర‌త అనేది ఇప్పుడు పాత‌కాలపు చేదు జ్ఞాప‌కంగా మిగిలిపోయింది.

28. పాత ప్ర‌భుత్వాలు ఖ‌జానా ఖాళీ చేసే ధోర‌ణులు అనుస‌రించేవి. నేను ఆ ప‌రిస్థితి దూరం చేసే ప్ర‌య‌త్నం చేశాను. మ‌న ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట గురించి ప్ర‌పంచ దేశాలు ఏమ‌నుకుంటున్నాయ‌న్న‌దే నాకు ప్ర‌ధానం. అందుకే వ‌ట్టి మాట‌లు క‌ట్టిపెట్టి చేత‌ల‌కు, సాధికార‌త‌కు ప్రాధాన్యం ఇచ్చాను. పార్టీ క‌న్నా నాకు జాతి ప్ర‌ధానం.

29. ప్ర‌భుత్వం అనేది ఒక స‌జీవ ప్ర‌క్రియ‌. గ‌తంలో వారు చేసిన మంచి ప‌నులు ఏమైనా ఉంటే శిర‌సు వంచి ఆ ప‌ని కొన‌సాగించేందుకు మేం సిద్ధం. గ‌త ప్ర‌భుత్వాలు చేప‌ట్టిన వాటిలో 118 కార్య‌క్ర‌మాలు ఎక్క‌డివి అక్క‌డే నిలిచిపోయి ఉన్నాయి. 10 వేల కోట్ల రూపాయ‌ల విలువ‌గ‌ల 270 ప్రాజెక్టులు స్తంభించిపోయాయి. ఇంత‌కుమించిన నిర్ల‌క్ష్యం ఏమీ ఉండ‌దు. వాటిని ముందుకు న‌డిపేందుకు మేం ప్ర‌య‌త్నించాం.

30. విధానంలోను, దృక్ప‌థంలోను స్ప‌ష్ట‌త ఉంటే నిర్ణ‌యాల్లో తొంద‌ర‌పాటు ఉండ‌దు. ప్ర‌తి సంవ‌త్స‌రం ఉత్త‌రప్ర‌దేశ్‌లో చెర‌కు రైతుల‌కు భారీ బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డం ఒక అల‌వాటుగా ఉండిపోయింది. వాటిలో 95 శాతం చెల్లింపులు పూర్త‌య్యాయ‌ని నేను స‌గ‌ర్వంగా చెప్ప‌గ‌లుగుతున్నాను. ఉజ్వ‌ల యోజ‌న ప‌థ‌కం కింద 50 ల‌క్ష‌ల పొగ‌చూరిన వంట గ‌దుల‌ను ఆధునికం చేయ‌గ‌లిగాం.

31. మ‌నం అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు ధీటుగా ఎదిగిన‌ప్పుడే అంత‌ర్జాతీయ ఆర్థిక‌రంగంలో అగ్ర‌స్థానానికి చేర‌గ‌లుగుతాం. వ్యాపారానుకూల‌త‌కు గ‌త కొద్ది రోజుల్లో మేం తీసుకున్న చ‌ర్య‌ల‌ను ఆ రేటింగ్ ఏజెన్సీలు ప్ర‌శంసించ‌డం అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.

32. మ‌నం ఏ ఒక్క‌రినీ అవ‌మానించ‌ని రీతిలో ఒకేలా చూడాల‌ని రామానుజాచార్య చెప్పేవారు. అంబేడ్క‌ర్‌, గాంధీజీ కూడా ఇదే ప్ర‌వ‌చించారు. వివ‌క్షా విధానాలు అనుస‌రిస్తే స‌మాజం చీలిపోతుంది. అలాంటి వివ‌క్ష‌కు వ్య‌తిరేకంగా పోరాడాల‌న్న‌దే మా ల‌క్ష్యం. ఆర్థిక అభ్యున్న‌తి మాత్ర‌మే చాల‌దు, సామాజిక స‌మాన‌త్వం అంత‌క‌న్నా ప్ర‌ధానం. సామాజిక దురాచారాలన్నింటికీ వ్య‌తిరేకంగా మ‌నం పోరాడాలి.

33. జి ఎస్ టి మ‌న ఆర్థిక వ్య‌వ‌స్థను ప‌టిష్టం చేస్తుంది. ఆ బిల్లును ఆమోదించినందుకు అన్ని పార్టీల‌కు ధ‌న్య‌వాదాలు తెల‌పాల్సిందే.

34. నిర్ణ‌యాలు వాయిదా వేయ‌డం పై ప్ర‌భుత్వానికి విశ్వాసం లేదు. అందుకే ఒక ర్యాంకు ఒక పెన్ష‌న్ ఆశ‌ల‌ను సాకారం చేశాం. నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ కు చెందిన అన్ని ఫైళ్ళను బ‌హిరంగం చేయ‌గ‌లిగాం. మేం ఇచ్చిన మ‌రో హామీ ఇది.

35. భిన్న‌త్వంలో ఏక‌త్వం మ‌న బ‌లం. మ‌న సాంస్కృతిక వార‌స‌త్వం ఇత‌రుల‌ను కూడా గౌర‌వించాల‌ని చెబుతుంది. అందుకే మ‌న నాగ‌రిక‌త విస్త‌రించ‌గ‌లిగింది.

36. దేశంలో హింస‌కు తావు లేదు. ఉగ్ర‌వాదం, మావోయిజంల‌ను ఈ జాతి స‌హించ‌దు.

37. మాన‌వ‌తా విలువ‌ల‌ను విస్మ‌రించేవారు వాటిని విస్త‌రింప‌చేయాల‌ని నేను కోరుతాను. పెషావ‌ర్‌లో పాఠ‌శాల విద్యార్థుల ఊచ‌కోత జ‌రిగిన‌పుడు భార‌త్‌లో ప్ర‌తి ఒక్క పాఠ‌శాల విల‌పించింది. పార్ల‌మెంటేరియ‌న్ల కంట నీరు వ‌చ్చింది. మాన‌వ‌తా విలువ‌ల‌కు ఇంత‌కు మించిన ద‌ర్ప‌ణం ఏం కావాలి. కానీ, ఉగ్ర‌వాదుల‌ను స‌మ‌ర్థిస్తున్న కోణం కూడా మ‌నం గ‌మ‌నించాలి.

38. పేద‌రికానికి వ్య‌తిరేకంగా పోరాటం సాగించాల‌ని నేను ఇరుగుపొరుగుల‌కు చెబుతూ ఉంటాను. మ‌న‌లో మ‌నం కొట్లాడుకొంటే ఆత్మ వినాశం కోరి తెచ్చుకున్న‌ట్లే అవుతుంది. పేద‌రికానికి వ్య‌తిరేకంగా క‌ల‌సిక‌ట్టుగా పోరాటం సాగించిన‌పుడే మ‌నం సుసంప‌న్న‌త సాధించ‌గ‌లం.

39. గ‌త కొద్ది రోజుల్లో బ‌లూచిస్తాన్‌, గిల్‌గిత్‌, పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ ప్ర‌జ‌లు నాకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇది 125 కోట్ల మంది భార‌తీయుల‌కు గౌర‌వం. ఇందుకు వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాను.

40. మ‌న స్వాతంత్య్ర యోధుల పింఛ‌న్ల‌ను 20 శాతం పెంచాల‌ని మేం నిర్ణ‌యించాం.

41. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల గురించి మేం మాట్లాడిన‌పుడ‌ల్లా ఇత‌రుల‌తో పోల్చితే ఎన్నో సేవ‌లు అందించిన కొంద‌రి ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. ఎంతో ధైర్య సాహ‌సాలతో పోరాటం సాగించిన ఆదివాసి సోద‌రుల గాథ‌లు ప్రాచుర్యంలోకి రాలేదు.

చాలా మంది బిర్సా ముందా గురించి వినే ఉంటారు. కానీ, ఇంకా ఎంద‌రో అలాంటివారు ఉన్నారు. వారంద‌రి చ‌రిత్ర‌ను రికార్డు చేసి ఆయా ప్రాంతాల్లో, మ్యూజియంల‌లో పెట్టాల‌ని మేం నిర్ణ‌యించాం.

42. ఒకే స‌మాజం, ఒకే అడుగు, ఒకే ల‌క్ష్యం సిద్ధాంతాన్ని మేం విశ్వ‌సిస్తాం.

43. “భార‌త మాతాకు జై, వందేమాతరం, జైహింద్‌”.