రష్యా ఉప ప్రధాని శ్రీ డిమిత్రి రోగోజిన్ ఈ రోజున ప్రధాని శ్రీ నరేంద్ర మోదీని కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన రష్యా అధ్యక్షులు పుతిన్ తరఫున ప్రధానికి శుభాకాంక్షలు అందజేశారు. భారతదేశం, రష్యాల మధ్యన కొనసాగుతున్న ప్రాజెక్టుల ప్రగతిని వివరించారు.
రష్యా ఎంతో నమ్మకమైన, కాల పరీక్షలకు తట్టుకొని నిలిచిన స్నేహదేశమని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. అన్ని రంగాల్లోను ఇరు దేశాల మధ్యన గల ద్వైపాక్షిక సంబంధాలు విస్తరించాలని, బలోపేతం కావాలని అధ్యక్షులు శ్రీ పుతిన్, తాను వెలిబుచ్చిన ఆకాంక్షను ఈ సంద్భంగా ప్రధాని మరోసారి ప్రస్తావించారు. జూన్ నెలలో తాష్కెంట్ లో అధ్యక్షులు శ్రీ పుతిన్ తో తన సమావేశాన్ని గుర్తు చేశారు. ఈ నెల ప్రారంభంలో కూడంకుళం అణు విద్యుత్ కర్మాగారం యూనిట్ 1 అంకితోత్సవ సందర్భంగా వీడియో లింకు ద్వారా శ్రీ పుతిన్ తో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. రష్యా అధ్యక్షులు పుతిన్ భారత సందర్శనకోసం తాను ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నట్టు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా రష్యా ఉప ప్రధానితో శ్రీ డిమిత్రి రోగోజిన్ తో అన్నారు.
Discussed several aspects of India-Russia ties in my meeting with Deputy PM Dmitry Rogozin. https://t.co/2jPuFLmKHu
— Narendra Modi (@narendramodi) August 20, 2016