పాకిస్తాన్ పార్లమెంట్ సభ్యుడు, తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ చైర్మన్ శ్రీ ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థించిన మేరకు ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనతో సమావేశమయ్యారు. పాకిస్తాన్ ను సందర్శించవలసిందంటూ ప్రధానిని శ్రీ ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానించారు కూడా.
ఇది ఇరువురి మధ్య మర్యాదపూర్వకంగా జరిగిన భేటీ. భారత్- పాక్ ద్వైపాక్షిక సంబంధాలలో ఇటీవల చోటు చేసుకున్న పురోగతిని వారు ఇరువురు స్వాగతించారు. తాజా పరిణామాలు రెండు దేశాల మధ్య మరింత సన్నిహితమైన సహకారానికి దారి తీయగలవన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా వారు వ్యక్తం చేశారు.