ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలిగా ఎన్నికైన మారియా ఫెర్నాండా ఎస్పినోసా గార్సెస్ ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకున్నారు. 73 వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షపదవికి ఎన్నికైనందుకు ప్రధాని నరేంద్రమోదీ , శ్రీమతి ఎస్పినోసాను అభినందించారు. రానున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్తీకి సంబంధించి తన ప్రాధాన్యతలను ఆమె ప్రధానికి వివరించారు. ఆమె తన నూతన బాధ్యతల నిర్వహణలో భారతదేశం పూర్తిస్థాయిలో నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి ఆమెకు హామీ ఇచ్చారు.
ఉగ్రవాదం, ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు, వాతావరణ మార్పులు వంటి ప్రధాన అంతర్జాతీయ సవాళ్లపై ఐక్యరాజ్యసమితి గట్టిగా వ్యవహరించాల్సిన అవసరం గురించి వారు చర్చించారు.
President-elect of the United Nations General Assembly calls on Prime Minister @narendramodi. https://t.co/J7WHQ0Whoh
— PMO India (@PMOIndia) August 10, 2018
via NaMo App pic.twitter.com/tixYebBNCc