Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాని చేతుల మీదుగా డాక్ట‌ర్ బి.ఆర్‌. అంబేద్క‌ర్ స్మార‌క నాణేల విడుద‌ల‌

డాక్ట‌ర్ బి.ఆర్. అంబేద్క‌ర్ 125వ జ‌యంతి ఉత్స‌వాల‌ను ఏడాదంతా జ‌రుపుకొంటున్న సంద‌ర్భంగా అంబేద్క‌ర్ స్మార‌క నాణేల‌ను రెండింటిని ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ విడుద‌ల చేశారు. 10 రూపాయ‌లు, 125 రూపాయ‌ల ముఖ విలువ కలిగిన రెండు నాణేల‌ను శ్రీ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ మ‌హాప‌రినిర్వాణ్ దివ‌స్ నాడు ప్ర‌ధాని విడుద‌ల చేశారు.

నిర్యాణం చెంది అర‌వై సంవ‌త్స‌రాలైన త‌ర్వాత కూడా ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో జీవించి ఉన్న వ్యక్తులు కొంతమందే ఉంటార‌ని, ఈ సందర్భంగా ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం భార‌త‌దేశం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో డాక్ట‌ర్ అంబేద్క్రర్ ఆలోచ‌నా విధానం చాలా ఉప‌యోగ‌క‌ర‌మ‌ని స్ప‌ష్టం చేసిన ప్ర‌ధాని, దాన్ని వినియోగించుకున్న‌నాడే మ‌నం ఆయన దూర‌దృష్టికి, అట్ట‌డుగు వ‌ర్గాల అభ్యున్న‌తికిగాను ఆయ‌న చేసిన కృషికి త‌గిన గౌర‌వం ఇచ్చిన‌వారమవుతామ‌న్నారు.

సామాజిక న్యాయం కోసం డాక్ట‌ర్ అంబేద్క‌ర్ చేసిన కృషికి అంతటా గుర్తింపు ల‌భించింద‌ని, అయితే ఆయ‌న ఆర్థిక‌ప‌ర‌మైన ఆలోచ‌న‌ల్ని, ముందుచూపును ఇంకా మ‌నం అర్థం చేసుకోలేక‌పోతున్నామ‌ని, ఇక‌నైనా ఆ ప‌ని చేద్దామ‌ని ప్ర‌ధాని అన్నారు. ఈ దేశంలో నిరంత‌రం డాక్ట‌ర్ అంబేద్క‌ర్ గురించి, రాజ్యాంగం గురించి చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉండాల‌ని, ఈ దిశ‌గా మ‌నం చేసిన మంచి ప్ర‌య‌త్న‌మే న‌వంబ‌ర్ 26ను రాజ్యాంగ దినోత్స‌వంగా జ‌రుపుకోవాలనే నిర్ణ‌య‌మ‌ని ప్ర‌ధాని చెప్పారు.

మ‌హిళా సాధికార‌త‌, భార‌త‌దేశ స‌మాఖ్య నిర్మాణం, ఆర్థిక‌, విద్యారంగాల‌పైన డాక్ట‌ర్ అంబేద్క‌ర్ కున్న దూర‌దృష్టిని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.
ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రులు శ్రీ అరుణ్ జైట్లీ, శ్రీ థావ‌ర్ చాంద్ గెహ్లాట్ పాల్గొన్నారు.