Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధానిని క‌లుసుకున్న నేపాల్ ఉప‌ప్ర‌ధాని, హోం శాఖ మంత్రి శ్రీ బిమ‌లేంద్ర నిధి

ప్ర‌ధానిని క‌లుసుకున్న నేపాల్ ఉప‌ప్ర‌ధాని, హోం శాఖ మంత్రి శ్రీ బిమ‌లేంద్ర నిధి


నేపాల్ ఉప ప్ర‌ధాని, హోమంత్రి శ్రీ బిమ‌లేంద్ర‌నాధ్ నిధి ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీని ఈ రోజున క‌లుసుకున్నారు.

నేపాల్ ఉప‌ప్ర‌ధానిగా, హోంమంత్రిగా నియ‌మితులైనందుకు శ్రీ బిమలేంద్ర‌నాధ్ నిధిని ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు. ప్ర‌ధాని పుష్ప క‌మాల్ ద‌హ‌ల్ ప్రచండ ఆధ్వ‌ర్యంలో ఏర్ప‌డిన నేపాల్ నూత‌న ప్ర‌భుత్వానికి ఈ సంద‌ర్భంగా ప్ర‌దాని శ్రీ న‌రేంద్ర‌మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

నేపాల్ లో సంభ‌విస్తున్న మార్పులు చేర్పుల‌ను శ్రీ బిమ‌లేంద్ర‌నిధి ప్ర‌ధానికి సంక్షిప్తంగా వివ‌రించారు.

నేపాల్‌, భార‌త‌దేశాల‌కు మ‌ధ్య‌న గ‌ల బంధాలు కేవ‌లం ఇరుదేశాల ప్ర‌భుత్వాల మ‌ధ్య‌న‌గ‌ల బంధాలుగా మాత్ర‌మే చూడ‌వ‌ద్దు. ఇవి ఇరుదేశాల ప్ర‌జ‌ల మ‌ధ్య‌నగ‌ల బంధాల‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌దాని శ్రీ న‌రేంద్ర మోదీ పేర్కొన్నారు. నేపాల్ తో సంప్ర‌దాయంగాగ‌ల బంధాల‌ను, స్నేహాన్ని, బంధుత్వాన్ని మ‌రింత బ‌లోపేతం చేసుకోవ‌డానికి భార‌త‌దేశం నిబ‌ద్ధ‌త‌తో కృషి చేస్తుంద‌ని ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు.

భూకంపం కార‌ణంగా నేపాల్ లో కొన‌సాగుతున్న పునర్ నిర్మాణ కార్య‌క్ర‌మాల‌కు స‌హాయం అందించ‌డానికి భార‌త‌దేశం పూర్తిస్థాయిలో నిబ‌ద్ధ‌త‌ను క‌లిగి వుంద‌ని ప్ర‌ధాని అన్నారు.

ఎంత వీల‌యితే అంత ముందుగా నేపాల్ ప్ర‌ధాని భార‌త‌దేశాన్ని సందర్శించాలంటూ ఈ సంద‌ర్భంగా ప్ర‌దాని శ్రీ న‌రేంద్ర మోదీ నేపాల్ ఉప ప్ర‌ధాని ద్వారా ఆహ్వానం ప‌లికారు.