Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధానితో సూఫీ పండిత ప్ర‌తినిధుల స‌మావేశం

ప్ర‌ధానితో సూఫీ పండిత ప్ర‌తినిధుల స‌మావేశం  <b

ప్ర‌ధానితో సూఫీ పండిత ప్ర‌తినిధుల స‌మావేశం  <b

ప్ర‌ధానితో సూఫీ పండిత ప్ర‌తినిధుల స‌మావేశం  <b

ప్ర‌ధానితో సూఫీ పండిత ప్ర‌తినిధుల స‌మావేశం  <b

ప్ర‌ధానితో సూఫీ పండిత ప్ర‌తినిధుల స‌మావేశం  <b

ప్ర‌ధానితో సూఫీ పండిత ప్ర‌తినిధుల స‌మావేశం  <b


సూఫీ ఆధ్యాత్మిక వేత్త‌లు ప్ర‌వ‌చించిన ఆద‌ర్శాలు భార‌తీయ‌ సంప్ర‌దాయ‌ విలువ‌ల్లో ఒక విడ‌దీయరాని భాగ‌మ‌ని, భార‌త దేశాన్ని బ‌హుళ సాంస్కృతిక స‌మ్మేళ‌నంగా రూపొందించ‌డంలో ఇవి కీల‌క పాత్ర పోషించాయ‌ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. దేశంలోని విభిన్న ప్రాంతాల‌కు చెందిన 40 మంది బ‌రే ల్వీ సూఫీ పండితులు ఈ రోజు సాయంత్రం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మాట్లాడుతూ… తీవ్ర‌వాద శ‌క్తులు సూఫీ ఆద‌ర్శాల‌ను, సిద్ధాంతాల ను బ‌ల‌హీన ప‌ర‌చ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని పేర్కొన్నారు. ఈ శ‌క్తుల‌ను సామాజిక మీడియాతో పాటు ఇత‌ర వేదిక‌ల ద్వారా సూఫీ పండితులు ఎదుర్కోవాల‌ని, త‌ద్వారా తీవ్ర‌వాద సిద్ధాంతాలు భార‌త్‌లో వేళ్లూనుకోకుండా చూడాల‌ని పిలుపునిచ్చారు. సూఫీ త‌త్వం ఎక్క‌డెక్క‌డ అభివృద్ధి చెందినా కూడా చెడును దూరంగా ఉంచుతూ త‌న‌ను తాను విస్త‌రింప‌చేసుకుంద‌ని పేర్కొన్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం ప్రారంభించిన నైపుణ్యాల అభివృద్ధి ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను పూర్తి స్థాయిలో ముస్లింలు వినియోగించుకోవాల‌ని ప్ర‌ధాని సూచించారు. సూఫీ ప్ర‌తినిధులు లేవ‌నెత్తిన వ‌క్ఫ్ ఆస్తుల‌కు సంబంధించిన అంశాల‌ను ప‌రిశీలిస్తామ‌ని మోదీ హామీ ఇచ్చారు. మ‌న దేశంలోని ప్ర‌తి రాష్ట్రంలో సూఫీ సంస్కృతి, సంగీతాన్ని త‌గిన విధంగా ప్రోత్స‌హించాల‌న్నారు.

అంత‌కుముందు ప్ర‌ధానితో సూఫీ పండితులు మాట్లాడుతూ.. ఇస్లాం విద్వేషాన్ని, తీవ్ర‌వాదాన్ని బోధించ‌ద‌ని చెప్పారు. ప్ర‌ధాన మంత్రి తో భార‌తీయ ముస్లింలకు సత్సంబంధాలు నెల‌కొన‌కూడ‌ద‌ని కొన్ని శ‌క్తులు కోరుకుంటున్నాయని వారు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లైన విచ్ఛిన్న‌క‌ర‌ ఓటు బ్యాంక్ రాజ‌కీయం వ‌ల్ల ముస్లింలు మ‌ధ్య‌వ‌ర్తుల ద్వారా ప్ర‌భుత్వంతో సంప్ర‌దింపులు జ‌రిపే ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు. కానీ ఇప్పుడు ముస్లింల‌తో పాటు భార‌తీయ ప్ర‌జ‌లంద‌రితోనూ ప్ర‌ధాన మంత్రి ప్ర‌త్య‌క్ష సంబంధాల‌ను క‌లిగి ఉండాల‌ని తాము కోరుకుంటున్నామ‌న్నారు. కులం, సామాజిక వ‌ర్గం, మ‌తంతో సంబంధం లేకుండా ప్ర‌జ‌లంద‌రి అభివృద్ధి కోసం ప‌నిచేయాల‌ని ప్ర‌ధానిని వారు కోరారు.

ఇస్లాం పేరుతో విస్త‌రిస్తున్న ఉగ్ర‌వాదం ప్ర‌పంచ వ్యాప్తంగా శాంతికి ప్ర‌మాదాన్ని తీసుకొస్తుంద‌ని సూఫీ పండితులు స్ప‌ష్టం చేశారు. సామాజిక‌, ఆర్థిక‌, రాజ‌కీయ కార‌ణాల‌తో జిహాద్ ను ప్రోత్స‌హిస్తున్న శ‌క్తుల‌ను అడ్డుకోవ‌డానికి త‌క్ష‌ణం చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఐ.ఎస్.ఐ.ఎస్‌., అల్ ఖైదా వంటి సంస్థ‌లు ఇస్లాం మార్గానికి ప్రాతినిధ్యం వ‌హించ‌డం లేద‌ని, ముస్లింల‌లో చైత‌న్యం తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

సూఫీ ఆలోచ‌న విధానాన్ని, సంస్కృతిని భార‌త దేశంలో పెంపొందించ‌డానికి వీరు ప‌లు సూచ‌న‌లు చేశారు. సూఫీ ప‌ర్యాట‌క స్థలాల అభివృద్ధి , సూఫీ పుణ్య క్షేత్రాల పున‌రుద్ధ‌ర‌ణ వంటి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరారు.

ప్ర‌తినిధి బృందంలో ఉన్న స‌భ్యులు.

* హ‌జ‌ర‌త్ స‌య్య‌ద్ మ‌హ్మ‌ద్ అష్రాఫ్‌ కిచౌచి, అధ్య‌క్షుడు, వ్య‌వ‌స్థాప‌కుడు అఖిల భార‌త ఉలేమా, మాషాయిక్ బోర్డు.
* హ‌జ‌ర‌త్ స‌య్య‌ద్ జ‌లాలుద్దీన్ అష్రాఫ్ , ఛైర్మ‌న్‌, మగ్ధూమ్ అష్రాఫ్‌ మిష‌న్ , కోల్ క‌తా.
* హ‌జ‌ర‌త్ స‌య్య‌ద్ అహ్మ‌ద్ నిజామీ, స‌జ్జ‌దా నాశిన్‌, ద‌ర్గా హ‌జ‌ర‌త్‌నిజాముద్దీన్ అలీయా, న్యూఢిల్లీ.
* షేక్ అబూబ‌క‌ర్ అహ్మ‌ద్ ముస్లియార్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, అఖిల భార‌త ముస్లిం పండితుల సంఘం.
* హ‌జ‌ర‌త్ స‌య్య‌ద్ మెహందీ చిస్తీ, కోశాధికారి, ద‌ర్గా ఏ ఖ్వాజా మొహినుద్దీన్ చిస్తీ , అజ్మీర్ ష‌రీఫ్‌.
* జ‌నాబ్ నాస‌ర్ అహ్మ‌ద్‌, విద్యా వేత్త‌