Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధానికి దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపిన అమెరికా అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా


అమెరికా అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి ఫోన్ చేసి దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు. కొత్త‌గా ఏర్పాటైన హాట్‌లైన్ ద్వారా వారిద్ద‌రూ మాట్లాడుకున్నారు. ఇరువురూ ప‌ర‌స్ప‌రం దీపావ‌ళి శుభ‌కాంక్ష‌లు అంద‌జేసుకున్నారు. “కొద్ది సేప‌టి కింద‌టే అమెరికా అధ్య‌క్షుడు మాట్లాడారు. ఇరువురం దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలియ‌జేసుకున్నాం. కొత్త‌గా ఏర్పాటైన హాట్‌లైన్ ద్వారా జ‌రిగిన తొలి సంభాష‌ణ ఇది. మ‌రిన్ని అంశాల‌పై కూడా ఇరువురం మాట్లాడుకున్నాం. అమెరికా అధ్య‌క్ష భ‌వ‌నం వైట్ హౌజ్‌లో కూడా దీపావ‌ళి జ‌రుపుకుంటున్న‌ట్లు తెలిసి సంతోషమేసింది. త్వ‌ర‌లో ట‌ర్కీలో జ‌రిగే జీ-20 స‌ద‌స్సులో స‌మావేశానికి ఇరువురం ఎదురుచూస్తున్నాం” అని ప్ర‌ధాన మంత్రి మోదీ ట్వీట్ చేశారు.