Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శ్రీ‌ నృపేంద్ర మిశ్రా కు వీడ్కోలు ప‌లికిన ప్ర‌ధాన మంత్రి


నేడు 7, లోక్ క‌ళ్యాణ్ మార్గ్ లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శ్రీ నృపేంద్ర మిశ్రా కు వీడ్కోలు ప‌లికారు. ఈ కార్య‌క్ర‌మాని కి ప‌లువురు కేంద్ర మంత్రులు మ‌రియు సీనియ‌ర్ ప్ర‌భుత్వాధికారులు హాజ‌ర‌య్యారు.

శ్రీ మిశ్రా ఒక అమూల్య‌మైన ఖ‌జానా వంటి వారు అని ప్ర‌ధాన మంత్రి అభివ‌ర్ణిస్తూ, ఆయ‌న తో త‌న ప్ర‌యాణం అయిదు సంవ‌త్స‌రాల క్రితం మొద‌లైన సంగతి ని గుర్తు కు తెచ్చారు. ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ యొక్క క‌ష్ట‌ప‌డి ప‌ని చేసే స్వ‌భావాన్ని గురించి, ప‌ని ప‌ట్ల స‌మ‌ర్ప‌ణ భావాన్ని గురించి, ఇంకా ప్ర‌భుత్వోద్యోగి గా అనుసరణీయమైన ఆయన వృత్తి జీవ‌నం గురించి ప్ర‌ధాన మంత్రి కొనియాడారు. పాల‌న లో శ్రీ మిశ్రా త‌నకు ఉన్న అపార అనుభ‌వాన్ని కనబరచిన వివిధ ఉదాహరణల ను ఆయ‌న స‌భికుల కు వివ‌రించారు.

శ్రీ మిశ్రా ను ఒక స‌మ‌ర్ధుడైనటువంటి మ‌రియు అనుభ‌వ‌శాలి అయినటువంటి అధికారి అని ప్ర‌ధాన మంత్రి చెప్తూ, ఘ‌ర్ష‌ణ త‌లెత్తినపుడు దాని ని ప‌రిష్క‌రించ‌డం లో ఆయన అందె వేసిన చేయి అని పేర్కొన్నారు. ఆయ‌న కు భ‌విష్య‌త్తు ఉజ్వ‌లం గా ఉండాల‌ని ప్ర‌ధాన మంత్రి ఆకాంక్షిస్తూ, భార‌త‌దేశం లో పాల‌న ప‌ర‌మైన విస్తృత సేవ‌ల కు గాను ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ కి ప్ర‌ధాన మంత్రి ధ‌న్య‌వాదాలు పలికారు.

ఒక ‘న్యూ ఇండియా’ క‌ల ను నెర‌వేర్చే దిశ గా కృషి చేసే అవ‌కాశాన్ని త‌న‌కు ఇచ్చినందుకు ప్ర‌ధాన మంత్రి కి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. ప్ర‌ధాన మంత్రి యొక్క ల‌క్ష్య ప్ర‌ధాన‌మైన, సాంకేతిక విజ్ఞానం పట్ల మక్కువ కలిగిన మ‌రియు మానవీయత తో కూడిన దార్శ‌నిక‌త అభినంద‌నీయ‌మైనది అని శ్రీ మిశ్రా చెప్తూ, ‘న్యూ ఇండియా’ను ఆవిష్క‌రించే ధ్యేయం తో ప‌ని చేయాల‌ని యావత్తు ప్రభుత్వ యంత్రాంగాని కి విజ్ఞ‌ప్తి చేశారు.

**