Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రాంతీయ విమాన‌యాన భాగ‌స్వామ్యం అంశం పై బ్రిక్స్ స‌భ్యత్వ దేశాల మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రం పై సంత‌కాల‌కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం


 

ప్రాంతీయ విమాన‌యాన భాగ‌స్వామ్యం సంబంధిత స‌హ‌కారం అంశం పై బ్రిక్స్ స‌భ్యత్వ దేశాలైన బ్రెజిల్‌, ర‌ష్యా, భార‌త‌దేశం, చైనా, ఇంకా ద‌క్షిణాఫ్రికా ల మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద పత్రం (ఎమ్ఒయు)పై సంత‌కాల‌కు  ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న ఈ రోజు సమావేశమైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.
 
ముఖ్యాంశాలు:
 
పౌర విమాన‌యాన రంగంలో స‌హ‌కారానికి గాను ఒక సంస్థాగ‌త చ‌ట్రాన్ని ఏర్పాటు చేయ‌డం ద్వారా బ్రిక్స్ స‌భ్య‌త్వ దేశాలు ప్ర‌యోజ‌నాన్ని పొందాల‌నేది  ధ్యేయంగా ఉంది.  ఈ దిగువ‌న పేర్కొన్న రంగాల‌ను స‌హ‌కారానికి గాను గుర్తించ‌డ‌మైంది:

*  ప్రాంతీయ స‌ర్వీసుల‌లో ఉత్త‌మ‌మైన విధానాలు మ‌రియు ప‌బ్లిక్ పాలిసీలు;
*  ప్రాంతీయ విమానాశ్ర‌యాలు;
*  విమానాశ్ర‌య సంబంధిత మౌలిక స‌దుపాయాల నిర్వ‌హ‌ణ మ‌రియు గ‌గ‌న‌త‌ల మార్గ‌నిర్దేశక సేవ‌లు;
*  నియంత్ర‌ణ సంస్థ‌ల మ‌ధ్య సాంకేతిక ప‌ర‌మైన స‌హ‌కారం;
*  నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు;
*  ప్ర‌పంచ స్థాయి కార్య‌క‌లాపాల తాలూకు సంప్ర‌దింపులు సహా ప‌ర్యావ‌ర‌ణ ప‌ర‌ంగా స్థిర‌త్వ సాధన; 
*  క్వాలిఫికేశన్ అండ్ ట్రయినింగ్;
*  ప‌ర‌స్ప‌రం నిర్ణయించిన మేర‌కు ఇత‌ర రంగాలు
 
ప్ర‌భావం:

భార‌త‌దేశానికి మ‌రియు ఇత‌ర బ్రిక్స్ స‌భ్య‌త్వ దేశాల‌కు మ‌ధ్య పౌర విమాన‌యాన సంబంధాల‌ లో ఈ ఎమ్ఒయు ఒక ముఖ్య‌మైన మైలు రాయి గా పేరు తెచ్చుకోగలుగుతుంది.  అలాగే   బ్రిక్స్ స‌భ్య‌త్వ దేశాల మ‌ధ్య వ్యాపారం, పెట్టుబ‌డి, ప‌ర్యాట‌కం మ‌రియు సాంస్కృతిక బృందాల రాక‌పోక‌లను పెంపొందించే స‌త్తా ఈ ఎమ్ఒయు కు ఉంటుంది.