Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రసిద్ధశాస్త్రీయ గాయని డాక్టర్ ప్రభ అత్రే గారి కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధానమంత్రి


ప్రసిద్ధ శాస్త్రీయ గాయకురాలు డాక్టర్ ప్రభ అత్రే గారి కన్నుమూత పట్ల తీవ్ర దు:ఖాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో

‘‘డాక్టర్ ప్రభ అత్రే గారు భారతదేశ శాస్త్రీయ సంగీత రంగం లోని జ్ఞానుల లో ఒకరు అని చెప్పాలి. ఆమె యొక్క కృషి ఒక్క భారతదేశం లోనే కాదు, యావత్తు ప్రపంచం లో కూడ ప్రశంసల కు నోచుకొన్నది. ఉత్కృష్టత మరియు సమర్పణ భావం అనే స్వరాల యొక్క సమ్మేళనం వలె ఆమె జీవనం ఉండింది. ఆమె ప్రయాస లు మన సాంస్కృతిక యవనిక కు వన్నెలనెన్నింటి నో అద్దాయి. ఆమె మరణించారని తెలిసి వేదన కు లోనయ్యాను. ఆమె కుటుంబానికి మరియు ఆమె యొక్క అభిమానుల కు ఇదే నా యొక్క సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.