Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రయాగ్ రాజ్ లో జరిగిన స్వచ్ కుంభ్, స్వచ్ ఆభార్ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం

ప్రయాగ్ రాజ్ లో జరిగిన స్వచ్ కుంభ్, స్వచ్ ఆభార్ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం

ప్రయాగ్ రాజ్ లో జరిగిన స్వచ్ కుంభ్, స్వచ్ ఆభార్ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం

ప్రయాగ్ రాజ్ లో జరిగిన స్వచ్ కుంభ్, స్వచ్ ఆభార్ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం


గంగా మాతా కీ జయ్

యమునా మాతా కీ జయ్

సరస్వతీ మాతా కీ జయ్

జయ్ ప్రయాగ్ రాజ్

ప్రియమైన నా సోదరులు మరియు సోదరీమణులారా,

పవిత్రమైన ప్రయాగ్ రాజ్ నగరాని కి, ప్రయాగ్ రాజ్ ప్రజల కు ఇవే నా శుభాకాంక్షలు. మరొక్క సారి ఈ ప్రయాగ్ నేల కు విచ్చేసినందుకు నేను నిజం గా ఎంతో కృత‌జ్ఞ‌త‌ గల వాడి నని అనుకొంటున్నాను. ఇదివరకు నేను కుంభ్ మేళా కై ఇక్కడ కు వచ్చాను, అప్పట్లో గంగ-యమున- సరస్వతి నదుల తీరప్రాంతాల లో పూజ చేసే అవకాశాన్ని, మరి అలాగే పవిత్ర అక్షయవట్ ను సందర్శించే అవకాశాన్ని దక్కించుకొన్నాను. ఈ సారి సంగమం లో పవిత్ర స్నానమాచరించి పూజ చేసే అపూర్వ అవకాశం నాకు చిక్కింది.

మిత్రులారా !

ప్రయాగ్ రాజ్ కు అనాది గా తపస్సు తో సంబంధం ఉంది. గత కొన్ని నెలలు గా కోట్లాది మంది ప్రజలు ఇక్కడ ధ్యానాన్ని మరియు తపస్సు ను చేస్తున్నారు. ప్రయాగ్ రాజ్ లోని ఏ ప్రాంతంలో అయినా ప్రతి ఒక్కరు తపస్సు ప్రభావం యొక్క అనుభూతి ని పొందుతారు. కుంభ్ మేళా లో హఠయోగులు, తపయోగుల తో పాటు మంత్ర యోగులు కూడా ఉన్నారు. వారి లో నా కర్మ యోగులు కూడా ఉన్నారు. మేళా ఏర్పాట్ల లో నిమగ్నమైన ఈ కర్మ యోగులు, పగలు, రాత్రి తేడా లేకుండా నిర్విరామం గా పని చేసి భక్తుల కు వివిధ సౌకర్యాలను కల్పించారు. భక్తుల ప్రాణాలను కాపాడడానికి తన ప్రాణాలను అర్పించిన, ఎన్ డి ఆర్ ఎఫ్ కు చెందిన మన సోదరుడు రాజేంద్ర గౌతమ్ కు నేను నివాళులు అర్పిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యుల కు నా హృదయపూర్వక సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. గంగా మాత ను పూజించే భక్తుల ను తమ పడవల లో వారి గమ్యస్థానాల కు సురక్షితం గా తీసుకువెళ్లిన వారు కూడా ఈ కర్మ యోగుల లో ఉన్నారు. మేళా ప్రారంభం కావడానికి ఎన్నో నెలల ముందు నుండే ఎంతో కష్టపడి అనేక పనులు చేసిన ప్రయాగ్ రాజ్ లోని స్థానిక ప్రజలు కూడా ఈ కర్మ యోగుల లో ఉన్నారు.

మిత్రులారా,

పారిశుధ్య కార్మికులు, స్వచ్చాగ్రహులు కూడా ఈ కర్మ యోగుల లో ఉన్నారు. వారి కృషి ఫలితంగానే కుంభ్ మేళా కు చెందిన విస్తారమైన ప్రాంతం లో చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాల కు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. గత 5, 6 వారాలు గా దాదాపు 20, 22 కోట్ల మందికి పైగా ప్రజలు సమావేశమైన ఒక ప్రాంతం లో, తాత్కాలిక ప్రాతిపదిక న పారిశుధ్య కార్యక్రమాల ను చేపట్టడమనేది చాలా పెద్ద బాధ్యత. నా మిత్రులారా, ఈ ప్రపంచం లో అసాధ్యమైంది ఏదీ లేదని మీరు రుజువు చేశారు.

సోదరులు మరియు సోదరీమణులారా,

కేవలం కొద్ది రోజుల క్రితం అటువంటి కర్మయోగులను కలుసుకునే అవకాశం నాకు దొరికింది. కుంభ్ మేళా లో అనేక వారాలు గా పారిశుధ్య కార్యక్రమాల లో నిమగ్నమై, తమ బాధ్యతల ను నిర్వహించిన వారందరూ నా సోదరులు మరియు సోదరీమణులే. ప్రతి రోజు వారు తెల్లవారుజామునే లేచి, తిరిగి అర్ధరాత్రి వరకు పని చేసే వారు. వారు రోజంతా చెత్త ను ఏరివేస్తూ, మరుగుదొడ్ల ను శుభ్రం చేస్తూ ఉండే వారు. ఈ పని లోనే వారు తలమునకలుగా ఉండే వారు. వారు ఎవరి దృష్టి ని ఆకర్షించకుండా, ఎవరి మెప్పు ను ఆశించకుండా వారి పని ని వారు నిశ్శబ్దంగా చేసుకునేవారు. అయితే, ఈ కర్మయోగులు, స్వచ్ఛాగ్రహులు చేస్తున్న కృషి గురించి నాకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతూ ఉండేది. నేను ఎవరి ని కలిసినా వారు, అలాగే, ప్రసార మాధ్యమాలు కూడా కుంభ్ మేళా లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ గురించి ప్రశంసించారు. పారిశుధ్య కార్యక్రమాల లో నిమగ్నమైన నా సోదరులు మరియు సోదరీమణులారా, ఈ ప్రసంశల కు, పొగడ్తల కు మీరు అర్హులు.

సోదరులు మరియు సోదరీమణులారా,

ప్రతి వ్యక్తి తాను ఎదగడానికి, ఒక ఉత్తమ వ్యక్తి గా పరివర్తన చెందడానికి వారి యొక్క అనుభవం సహాయపడుతుంది. వీటి లో చాలా సంఘటనలు చిరస్మరణీయం గా మిగిలిపోతాయి. నాకు ఈ రోజు కూడా అటువంటి చిరస్మరణీయమైందే. ఈ రోజు నా సోదరులు మరియు సోదరీమణులైన పారిశుధ్య కార్మికుల పాదాల ను నేను కడిగి, నమస్కరించి ‘‘చరణ్ వందనం’’ నిర్వహించాను. ఈ సంఘటన ను నేను ఎప్పటికీ మరువలేను. వారి దీవెనలు, అభిమానం, అలాగే మీ దీవెనలు, మీ అభిమానం ఎల్లప్పుడూ నాతో ఉంటాయని నేను అనుకొంటున్నాను. నేను ఇదే విధం గా ఎల్లప్పుడూ మీకు సేవ చేయాలని కోరుకొంటున్నాను.

మిత్రులారా,

‘‘దైవికమైన ఈ కుంభ్ మేళా’’ను మీరు ‘‘అద్భుతమైన కుంభ్ మేళా’’గా తీర్చిదిద్దదానికి అన్నివిధాలా కృషి చేశారు. 20 వేలకు పైగా ఉన్న చెత్త కుండీలను, లక్ష కు పైగా ఉన్న మరుగుదొడ్లను నా సోదరులు మరియు సోదరీమణులైన పారిశుధ్య కార్మికులు ఏ విధం గా శుభ్రపరిచారనేది ఎవరూ కనీసం ఊహించలేరు. అయితే, వారు ఈ విధం గా కష్టపడి పనిచేయడం వల్ల ఈ ఏడాది కుంభ్ మేళా- స్వచ్ఛ కుంభ్ మేళా గా పేరు తెచ్చుకుంది. ఇటువంటి విస్తృతమైన ఏర్పాట్ల లో పాలుపంచుకొన్న ప్రతి ఒక్క పారిశుధ్య కార్మికుని కృషి శ్లాఘనీయమైనది. మీరు చేసిన కృషి కి గుర్తింపు గా మేము ఒక ‘‘స్వచ్ఛ్ సమ్మాన్ కోశ్’’ ను ఏర్పాటు చేశాము. ఈ నిధి సహాయం తో, ఈ కుంభ్ మేళా లో ఎవరైతే పని ని చేశారో, మీకు, మీ కుటుంబాల కు ప్రత్యేక పరిస్థితుల్లో చికిత్స అందుతుంది. ఇది, మీరు చేసిన ఈ సేవకు కృతజ్ఞతగా, దేశ ప్రజల తరఫున ప్రేమతో మీకు అందజేస్తున్న కానుక .

మిత్రులారా !

దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతిని జరుపుకుంటున్న సమయంలోనే స్వచ్ కుంభ్ మేళాను నిర్వహించుకున్నాము. సుమారు వంద సంవత్సరాల క్రితం, గాంధీజీ హరిద్వార్ లో కుంభ్ మేళాను సందర్శించినప్పుడు, స్వచ్ కుంభ్ మేళా నిర్వహించాలన్న తన కోరికను వ్యక్తం చేశారు. భారత ప్రజల సహకారంతో, స్వచ్చ భారత్ అభియాన్ తన లక్ష్య సాధనకు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ నాటి మన దేశం బహిరంగ మల విసర్జన లేని దేశంగా ప్రకటించుకోవాలని తీవ్రంగా కృషి చేస్తోంది.

ఈ నేపథ్యంలో, ప్రయాగ్ రాజ్ లోని స్వచ్ఛాగ్రహులు మొత్తం దేశానికి ఒక ప్రేరణ గా, ఆదర్శం గా నిలిచారు.

సోదరులు మరియు సోదరీమణులారా,

ఇక పరిశుభ్రత విషయానికి వస్తే, ఈ సారి కుంభ్ మేళా కు వచ్చిన సందర్శకులు గంగా మాత ప్రశాంతత ను గురించి చర్చించుకొన్నారు. గత ఒకటి, ఒకటిన్నర నెలల నుండి సామాజిక మాధ్యమం ద్వారా ప్రజల అనుభవాల ను గురించి ప్రతిస్పందన నాకు అందుతోంది. ఈ రోజు దానిని నేను వ్యక్తిగతం గా అనుభవించాను. గతం లో నేను అనేక సార్లు ప్రయాగ్ రాజ్ ను సందర్శించాను. అయితే, గంగా జలం లో ఇంత ప్రశాంతత ను నేను ఎప్పుడు చూడలేదు.

మిత్రులారా,

నమామి గంగే కార్యక్రమ నిర్వహణ లో ఈ గంగానది శుభ్రత అనేది సానుకూల పరిణామాని కి ఒక ఉదాహరణ. గంగానది లోకి ప్రవహించే 32 మురుగునీటి కాలువలను, ఈ కార్యక్రమం క్రింద మూసివేయడం జరిగింది. కలుషితమైన ఈ జలాలను మురుగునీటి శుద్ధి కేంద్రాలలో శుద్ధి చేసిన తర్వాత మాత్రమే తిరిగి గంగానదిలో విడుదల చేయడానికి అనుమతిస్తున్నారు.

మిత్రులారా,

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. అనేక మంది స్వచ్ఛాగ్రహులు ఇప్పటికే ‘‘నమామి గంగే’’ కార్యక్రమాని కి తమ విరాళాల ను అందజేసి, ఆర్ధికం గా సహాయపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం నేను కూడా చిన్న మొత్తం లో విరాళం అందజేశాను. సియోల్ శాంతి బహుమతి కింద నేను స్వీకరించిన ఒక కోటి ముప్ఫై లక్షల రూపాయల ను నమామి గంగే కార్యక్రమాని కి విరాళం గా అందజేశాను. గత నాలుగున్నర సంవత్సరాల లో, ప్రధాన మంత్రి గా, నేను స్వీకరించిన బహుమతులన్నింటినీ వేలం వేసి, ఆ వచ్చిన మొత్తాన్ని, గంగమ్మ తల్లి సేవ కు అంకితమిచ్చాను.

మిత్రులారా,

మన పడవల ను నడిపే వారు కూడా గంగామాత పరిరక్షణ కు అంకితమైన వారే. ప్రయాగ్ రాజ్ కు, పడవలు నడిపే వారి కి మధ్య చిరకాల సంబంధం ఉంది. పడవ లు నడిపే వారి ప్రస్తావన లేకుండా, మర్యాద పురుషోత్తముడైన రాముని రామాయణం కూడా పూర్తి కాదు. ప్రపంచాన్ని రక్షించేవాడినే ఈ నావికులు రక్షించారు. మీకు, నాకు మధ్య సంబంధం కూడా చాలా పటిష్టమైనది. మీకు మీరు భగవాన్ రాముల వారి సేవకులు గా భావిస్తారు. కాగా, నేను మీ ముఖ్య సేవకుని గా లేదా ప్రధాన సేవకుని గా భావిస్తాను. మీకు మీరు గంగామాత పుత్రులు గా భావిస్తారు, కాగా, నేను గంగామాత పిలుపు మేరకు మీ సేవ లో ఉంటాను. ఇప్పుడు నాకు చెప్పండి, మీకు, నాకు మధ్య పటిష్టమైన బంధం ఉందా ? లేదా ? మీరు ఏ విధం గా నైతే భక్తుల రక్షణ బాధ్యత ను స్వీకరించి, వారి కి మార్గదర్శనం చేస్తున్నారో, అది నిజం గా ప్రశంసనీయం. మీ సహాయం లేకుండా, ఇటువంటి భారీ కార్యక్రమం నిర్వహించడం చాలా కష్టం. మరొక సారి, నా సోదర నావికుల కు నేను వందనాలు తెలియజేస్తున్నాను.

సోదరులు మరియు సోదరీమణులారా,

ఈ ఏడాది కుంభ్ మేళా చాలా ప్రత్యేకతల ను సంతరించుకుంది. మొదటిసారిగా భక్తులకు సంగమంలో పవిత్ర స్నానం తో పాటు అక్షయవట్ ను చూసే అవకాశం లభించింది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి అక్షయవట్ ను కోట లోపలే ఉంచారు. ప్రభుత్వం ఈసారి భక్తుల కు, అక్షయవట్ కు మధ్య దూరాన్ని తొలగించింది. ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు అక్షయవట్ ను, సరస్వతీ కుంభ్ మేళా ను సందర్శించుకోగలిగారని నాకు చెప్పారు.

సోదరులు మరియు సోదరీమణులారా,

ఈ ఏడాది కుంభ్ మేళా ఆధ్యాత్మికత, భక్తి, ఆధునికత ల మిశ్రమం గా ఉందని, క్రితం సారి నేను ఇక్కడ కు వచ్చినప్పుడు, నాకు చెప్పారు. మీరు మీ కఠోర శ్రమ తో దీని ని సాధించినందుకు ఈ రోజు న నాకు చాలా ఆనందంగా ఉంది. ధ్యానం తో కూడిన ఈ ప్రదేశాన్ని ఆధునిక సాంకేతికత తో అనుసంధానం చేసి, ఒక అద్భుతమైన సంగమాన్ని సృష్టించడం తో, ఇది అందరి దృష్టి ని ఆకర్షించింది. ఆ విధం గా, ఈ కుంభ్ మేళా సమ్మేళనం ఒక డిజిటల్ కుంభ్ మేళా గా గుర్తుండిపోతుంది.

మిత్రులారా,

ప్రయాగ్ రాజ్ అనుగ్రహం వల్ల, సాధువులు, రుషుల దీవెన ల వల్ల, ఒక సక్రమమైన విధానం వల్ల, మీ క్రమశిక్షణ వల్ల ఈ మేళా ఒక సురక్షితమైన, శాంతియుతమైన మార్గం లో నిర్వహించడం జరిగింది. కుంభ్ మేళా లో ఉత్తర్ ప్రదేశ్ పోలీసు ల పాత్ర ను చాలా మంది ప్రజలు మెచ్చుకోవడం నేను చూశాను. తప్పిపోయిన పిల్లలు, పెద్దలు, వృద్ధుల ను కేవలం కొన్ని గంటల్లోనే తిరిగి వారి కుటుంబ సభ్యుల వద్దకు చేరవేయడం లో సంబంధిత శాఖ విశేషమైన కృషి చేసింది. అదేవిధంగా, పోగొట్టుకున్న వస్తువులు, మొబైల్ ఫోన్ లను కూడా మీరు విజయవంతం గా రాబట్టగలిగారు. ఈ విషయం లో భద్రత దళాల ను కూడా నేను అభినందిస్తున్నాను.

కుంభ్ మేళా సమయం లో మీరు చాలా అలసిపోయిన సందర్భాలు అనేకం ఉండవచ్చునని నాకు తెలుసు, ఆ సమయం లో కనీసం కాస్త విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా మీకు లభించి ఉండక పోవచ్చు. అయితే, మీ వ్యక్తిగత సమస్యల ను కూడా పట్టించుకోకుండా, మీరు కుంభ్ మేళా అవసరాల కే ప్రాధాన్యమిచ్చారు. కుంభ్ మేళా లో దాదాపు ఎనిమిది వేల కు పైగా సేవా-మిత్ర కార్యకర్త లు కూడా రేయింబవళ్లు పనిచేసినట్లు కూడా నాకు చెప్పారు.

మిత్రులారా,

ప్రయాగ్ రాజ్ లో కుంభ్ మేళా ను ఏర్పాటు చేసినప్పుడు ప్రయాగ మొత్తం కుంభ్ మేళా గా మారిపోయింది. ప్రయాగ్ రాజ్ ప్రజలు కూడా అదే విధమైన ఆధ్యాత్మిక స్థాయి కి చేరుకొన్నారు. ప్రయాగ్ రాజ్ ను ఒక సుందరమైన నగరం గా అభివృద్ధి చేస్తున్నప్పుడు, కుంభ్ మేళా కోసం విజయవంతం గా ఏర్పాట్లు చేస్తున్నప్పుడు ప్రయాగ్ రాజ్ ప్రజలు పోషించిన పాత్ర మొత్తం దేశానికే స్ఫూర్తిని ఇచ్చింది.

మిత్రులారా,

ఈసారి మీ సహకారం తో కుంభ్ మేళా కోసం అభివృద్ధి చేసిన సౌకర్యాలు శాశ్వతం గా ఉంటాయి. గతం లో, కుంభ్ మేళా కోసం చేసిన ఏర్పాట్లు తాత్కాలికం గా ఉండేవి, కుంభ్ మేళాతోనే ఆ సౌకర్యాలన్నీ నిలిచిపోయేవి. ఈసారి ఏర్పాట్లన్నీ ప్రయాగ్ రాజ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచి చిరకాలం నిలచే విధం గా చేయడం జరిగింది. ఇక్కడ 11 నెలల సమయం లో నిర్మించిన నూతన విమానాశ్రయ టర్మినల్ ను గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. రహదారులు, వంతెనలు, విద్యుత్తు ల వంటి సౌకర్యాలు లేదా నీటి సరఫరా వెంబడి నిర్మించిన ఎస్ టిపి లు అనేక సంవత్సరాల పాటు కలుషిత జలాలు సంగమం లో కలవకుండా నిరోధిస్తాయి.

కుంభ్ మేళా భక్తి, సేవా భావం లతో పాటు పరిశుభ్రత కు, శ్రేయస్సు కు ఒక చిహ్నం గా నిలచింది. ఇది ప్రభుత్వ కృషి ఫలితం. కుంభ్ మేళా ను విజయవంతం గా నిర్వహించినందుకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ అధికారుల ను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కు చెందిన అన్ని శాఖల ను నేను మరొక సారి అభినందిస్తున్నాను.

సోదరులు మరియు సోదరీమణులారా,

అనాది గా, కుంభ్ మేళా ఒక సామాజిక సందేశం తో పరిసమాప్తం అవుతూ వస్తోంది. ఈ సంప్రదాయం మధ్యలోనే నిలచిపోయింది, ఇది ప్రాథమికం గా ఒక మతపరమైన ఉత్సవం గా కొనసాగుతోంది. అయితే, ఈసారి, కుంభ్ మేళా దైవత్వం, అద్భుతమైన సందేశం తో పాటు దేశాని కి పారిశుధ్యం, పరిశుభ్రత లను గురించి ఒక బలవత్తరమైనటువంటి సందేశాన్ని ఇచ్చింది. ఇది ప్రజా విద్య ను కూడా చేపట్టింది. భవిష్యత్తు లో, ఎప్పుడైనా ఒక మతపరమైన, సామాజిక లేదా రాజకీయ పరమైన ఉత్సవం జరిగితే, పరిశుభ్రత విషయం లో ఎవరూ రాజీ పడరని నేను విశ్వసిస్తున్నాను. మీ కఠోర శ్రమ ఫలితంగానే ఈ సందేశం వెలువడింది.

ఈ రోజు న నా జీవితాశయం నెరవేరింది. నేను సాధువులు, రుషు ల దీవెన లను కోరుకొంటున్నాను, వారి ని సందర్శిస్తూ ఉంటాను. అయితే, ఈ రోజు న మీరే నా సాధువులు, రుషులూ ను. మీరే నిజమైన భక్తులు. సాధువులు, రుషుల దీవెన లు, బోధనల తో నేను మీ ముందు ఉన్నాను. మన గ్రంథాలు ఈ విధం గా ఘోషిస్తున్నాయి –

ना कामे राज्यपम न मोक्षम न पुनर्भवम।

कामे दुख तप्तोना प्राणिणार्तशम ।।

మానవాళి సంక్షేమం కోసం పేద వారి కి, బాధపడుతున్న వారి కి తప్పక సేవ చేయాలన్న సందేశాన్ని మన పూర్వికులు మనకు అందజేశారు. నావికులు, పారిశుధ్య కార్మికులు, జూనియర్ స్థాయి పోలీసు సిబ్బంది కుటుంబాల కు ఈ నిధి సహాయపడుతుందని నేను చాలా సంతోషిస్తున్నాను. మీ అందరి కి అనేకానేక శుభాకాంక్షలు, అభినందనలూ ను.

మీకు ఇవే ధన్యవాదాలు.

**