Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో పాల్గొనడం అదృష్టం: ప్రధానమంత్రి

ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో పాల్గొనడం అదృష్టం: ప్రధానమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బుధవారం ప్రయాగ రాజ్ లో మహా కుంభమేళాను సందర్శించి పవిత్ర స్నానం ఆచరించారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వేర్వేరుగా చేసిన పోస్టుల్లో ఆయన ఇలా పేర్కొన్నారు:

 

“ప్రయాగరాజ్ లో మహా కుంభమేళాలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. సంగమ స్నానం దివ్యానుభూతినిచ్చే క్షణం. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన కోట్లాదిమంది ప్రజల్లాగే నాలోనూ భక్తిభావం నిండింది.

 

గంగా మాత అందరికీ శాంతి సౌభాగ్యాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను.”

 

“ప్రయాగరాజ్ మహాకుంభమేళా పవిత్ర సంగమంలో స్నానం, అనంతరం పూజార్చనలు ఆచరించే భాగ్యం నేడు కలిగింది. గంగామాత ఆశీస్సులు పొందిన తర్వాత అపారమైన మనశ్శాంతి, సంతృప్తి లభించాయి. దేశప్రజలందరూ సుఖ సంతోషాలతో, సమృద్ధితో, ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని కోరుతున్నాను. హర్ హర్ గంగే.”

 

“దివ్యమైన ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో విశ్వాసం, భక్తిభావం, ఆధ్యాత్మికతా సంగమం ప్రతి ఒక్కరినీ ముంచెత్తుతోంది. పావనమైన, పుణ్యప్రదమైన కుంభమేళాలో స్నానానికి సంబంధించి కొన్ని చిత్రాలు…” 

“प्रयागराज महाकुंभ में आज पवित्र संगम में स्नान के बाद पूजा-अर्चना का परम सौभाग्य मिला। मां गंगा का आशीर्वाद पाकर मन को असीम शांति और संतोष मिला है। उनसे समस्त देशवासियों की सुख-समृद्धि, आरोग्य और कल्याण की कामना की। हर-हर गंगे!”

“प्रयागराज के दिव्य-भव्य महाकुंभ में आस्था, भक्ति और अध्यात्म का संगम हर किसी को अभिभूत कर रहा है। पावन-पुण्य कुंभ में स्नान की कुछ तस्वीरें….”

 

 

***

MJPS/SR