Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రముఖ స్క్వాష్ క్రీడాకారుడు శ్రీ రాజ్ మన్‌చందా కన్నుమూత ప్రధానమంత్రి సంతాపం


ప్రముఖ స్క్వాష్ క్రీడాకారుడు శ్రీ రాజ్ మన్‌చందా ఈ రోజు మరణించారుదీనిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారుశ్రీ రాజ్ మన్‌చందా సిసలైన భారతీయ స్క్వాష్ దిగ్గజంఅంకితభావంప్రావీణ్యం కలిగిన క్రీడాకారునిగా ఆయన ప్రసిద్ధి చెందారంటూ శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారుశ్రీ మన్‌చందా సైన్యంలో పనిచేసి దేశానికి సేవలందించారంటూ ప్రధాని కొనియాడారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి పొందుపరిచిన ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘శ్రీ రాజ్ మన్‌చందా జీ మరణించారన్న వార్త విని బాధపడ్డానుఅంకితభావంప్రావీణ్యత కలిగిన క్రీడాకారునిగా ప్రసిద్ధి పొందిన ఆయనభారతదేశ స్క్వాష్ రంగంలో సిసలైన దిగ్గజ క్రీడాకారుడుఆయన సాధించిన కీర్తికి తోడుఆట పట్ల ఆయనకున్న ప్రేమ.. నవతరానికి ప్రేరణనివ్వగలిగిన ఆయన దక్షత ఆయనను విశిష్ట స్థానంలో ఉంచాయిఒక్క స్క్వాష్ కోర్టులోనే కాకుండాసైన్యంలో పనిచేయడం ద్వారా ఆయన దేశానికీ సేవలు అందించారుఆయన కుటుంబ సభ్యులకూఅభిమానులకూ సంతాపాన్ని తెలియజేస్తున్నానుఓం శాంతిప్రధానమంత్రి @narendramodi”