దేశవ్యాప్త సిక్కు ప్రముఖుల ప్రతినిధివర్గం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న 7, లోక్ కళ్యాణ్ మార్గ్ లో భేటీ అయ్యారు.
ఈ సమావేశం లో రైతుల సంక్షేమం, యువత సశక్తీకరణ, మత్తు పదార్థాల కు తావు ఉండనటువంటి సమాజం, జాతీయ విద్య విధనం, నైపుణ్యాల ను అభివృద్ధి పరచడం, ఉపాధి కల్పన, సాంకేతిక విజ్ఞానం లతో పాటు పంజాబ్ యొక్క సమగ్ర అభివృద్ధి వంటి అంశాల పై ప్రతినిధివర్గం తో ప్రధాన మంత్రి మనస్సు విప్పి మాట్లాడారు.
ప్రతినిధివర్గాన్ని కలుసుకొన్నందుకు ప్రధాన మంత్రి ప్రసన్నత ను వెలిబుచ్చుతూ, మేధావులు సమాజం లో అభిప్రాయాన్ని నిర్మిస్తారన్నారు. పౌరుల ను కలిపి ఉంచుతూ, వారి కి నేర్పించేటటువంటి మరియు ప్రజల కు సరి అయిన సమాచారం లభించే దిశ లో కృషి చేయవలసిందంటూ ప్రతినిధివర్గం సభ్యుల కు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. ఐకమత్యం తాలూకు భావన కు ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని గురించి ఆయన నొక్కిచెప్తూ, అది మన దేశం లోని విస్తృతమైనటువంటి మరియు సుందరమైనటువంటి వైవిధ్యం నడుమ కేంద్రీయ స్తంభం గా ఉంటోంది అని వ్యాఖ్యానించారు.
మాతృభాష లో విద్య బోధన కు ఉన్న ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. మాతృ భాష లో ఉన్నత విద్య వ్యాప్తి ని సాకారం చేసేందుకు వృత్తి నైపుణ్య ప్రధాన పాఠ్యక్రమాల ను అభివృద్ధి పరచడం కోసం కృషి జరుగుతోందని ఆయన అన్నారు.
ఈ తరహా భేటీ కోసం తమను ఆహ్వానించినందుకు ప్రధాన మంత్రి కి ప్రతినిధి వర్గం ధన్యవాదాలు పలికింది. ప్రధాన మంత్రి ఇంతటి ఇష్టాగోష్ఠియుక్త వాతావరణం లో తమ తో మాట్లాడుతారని తాము ఎన్నడూ అనుకోలేదని ప్రతినిధివర్గ సభ్యులు అభిప్రాయపడ్డారు. సిక్కు సముదాయం సంక్షేమం కోసం ప్రధాన మంత్రి నిరంతరం గా అనేక చర్యల ను తీసుకొంటూ ఉండడాన్ని వారు ప్రశంసించారు.
***
Had a productive meeting with members of the Sikh community. We had extensive discussions on various subjects. https://t.co/3uXeVRUugS
— Narendra Modi (@narendramodi) March 24, 2022