Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రముఖ నేపథ్య గాయకుడు శ్రీ పి. జయచంద్రన్ మృతికి ప్రధానమంత్రి సంతాపం


ప్రముఖ నేపథ్య గాయకుడు శ్రీ పి. జయచంద్రన్ మృతికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన వివిధ భాషల్లో శ్రావ్యంగా పాడిన పాటలు భావి తరాల వారి మనసులనూ చూరగొంటూనే ఉంటాయి అని ప్రధాని అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:

‘‘శ్రీ జయచంద్రన్ జీది సుమధుర స్వరం, ఆ గళం ఏ రకమైన భావాలనైనా ఇట్టే పలికించగలదు. ఆయన వేరువేరు భాషల్లో శ్రావ్యంగా ఆలపించిన గీతాలు రాబోయే తరాల శ్రోతలను సైతం ఆకట్టుకొంటూనే ఉంటాయి. ఆయన ఇక మన మధ్య లేరని తెలిసి బాధపడ్డాను. ఈ దు:ఖ ఘడియల్లో ఆయన కుటుంబానికీ, ఆయన అభిమానులకూ నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను.’’

 

***