Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీ మనోజ్ కుమార్ కన్నుమూత.. ప్రధానమంత్రి సంతాపం


ప్రముఖ నటుడు, చలనచిత్ర దర్శకుడు శ్రీ మనోజ్ కుమార్ కన్నుమూత పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. శ్రీ మనోజ్ కుమార్ భారతీయ చలనచిత్ర రంగంలో ఓ దిగ్గజం, ముఖ్యంగా ఆయన చలనచిత్రాల్లో దేశభక్తి భావాన్ని ప్రస్ఫుటం చేసినందుకుగాను ఆయనను స్మరించుకొంటూ ఉంటామంటూ ప్రధాని ప్రశంసలు కురిపించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఆ సందేశంలో:

‘‘ప్రముఖ నటుడు, చలనచిత్ర దర్శకుడు శ్రీ మనోజ్ కుమార్ జీ మరణించారన్న వార్త తెలిసి ఎంతో విచారానికి లోనయ్యాను. ఆయన భారతీయ చలనచిత్ర రంగంలో ని లబ్ధప్రతిష్ఠుల్లో ఒకరు. ముఖ్యంగా ఆయన చలనచిత్రాల్లో పెల్లుబికిన దేశ భక్తి భావావేశానికిగాను ఆయనను స్మరించుకొంటూ ఉంటాం. మనోజ్ జీ చలనచిత్రాలు మన దేశం పట్ల గౌరవ భావాన్ని పెంపొందింపచేశాయి. ఆయన సినిమాలు తరాల తరబడి ప్రేరణను అందిస్తూనే ఉంటాయి. ఈ దు:ఖ ఘడియలో ఆయన కుటుంబానికి, ఆయనను అభిమానించే వారికి నేను నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి.’’ అని పేర్కొన్నారు.