Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రముఖ టెనిస్ క్రీడాకారుడు శ్రీ నరేశ్ కుమార్ కన్నుమూత పట్ల సంతాపంతెలిపిన ప్రధాన మంత్రి


టెనిస్ క్రీడ లో ప్రముఖ ఆటగాడు అయినటువంటి శ్రీ నరేశ్ కుమార్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘శ్రీ నరేశ్ కుమార్ ను భారతదేశం లో క్రీడారంగాని కి ఆయన అందించిన మార్గదర్శకప్రాయం అయినటువంటి తోడ్పాటు కు గాను స్మరించుకోవడం జరుగుతుంది. టెనిస్ కు బహుళ ప్రజాదరణ ను సాధించి పెట్టడం లో ఆయన ఒక ప్రధానమైన పాత్ర ను పోషించారు. ఒక గొప్ప క్రీడాకారుడు కావడం తో పాటు గా ఆయన ఒక ప్రశంసాయోగ్యమైనటువంటి గురువు గా కూడాను వ్యవహరించారు. ఆయన ఇక లేరన్న వార్త తెలిసి బాధ కలిగింది. ఆయన కుటుంబాని కి మరియు ఆయన మిత్రుల కు ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.