ప్రపంచ శాంతికోసం పాటుపడుతూ అస్సాంలోని బారపేటలో ఉన్న కృష్ణ గురు సేవాశ్రంలో జరుగుతున్న ‘కృష్ణగురు ఏక్ నామ్ అఖండ కీర్తన’ నుద్దేశించి ఈ రోజు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యకమం జనవరి 6 న మొదలై నెలరోజులపాటు సాగింది. దీనికి హాజరైన వారినుద్దేశించిన ప్రధాని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. కృష్ణగురు పురాతన భారత సంప్రదాయ జ్ఞానాన్ని, సేవను, మానవతావాదాన్ని ప్రచారం చేయగా ఆ బోధనలు నేటికీ ప్రతిధ్వనిస్తున్నాయన్నారు. గురు కృష్ణ ప్రేమానంద ప్రభు జీ బోధనల దైవిక స్వభావం, ఆయన శిష్యుల కృషి ఈ సందర్భంగా ప్రస్ఫుటంగా కనబడుతున్నాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. గతంలోనూ, ఈ రోజు కూడా వ్యక్తిగతంగా నేరుగా పాల్గొనాలని భావించినా కుదరకపోవటంతో వీలైనంత త్వరలో అలాంటి అవకాశం దక్కేలా కృష్ణగురు ఆశీస్సులందుకున్నారు.
ప్రతి పన్నెండేళ్ళకొకసారి కృష్ణ గురూజీ సారధ్యంలో అఖండ ఏక నామ జపం జరిగే సంప్రదాయాన్ని ప్రస్తావిస్తూ, ఆధ్యాత్మిక ఘట్టాలను ఒక విధిగా చేపట్టటమన్నది భారతీయ సంప్రదాయంలో భాగమన్నారు. ఇలాంటి ఘట్టాల వలన వ్యక్తులలో, సమాజంలో ఒక రకమైన బాధ్యత పెరుగుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సందర్భాలలో ప్రజలు ఒక చోట చేరినప్పుడు గడిచిన పన్నెండేళ్ళలో జరిగిన విషయాలు చర్చించుకొని విశ్లేషించుకుంటారన్నారు. దీనివలన భవిష్యత్తుకు ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకునే అవకాశముంటుందన్నారు. కుంభ మేళా, బ్రహ్మపుత్రానది పుష్కరాలు, తమిళనాడులోని కుంభకోణంలో జరిగే మహామహం, భగవాన్ బాహుబలి మహామస్తకాభిషేకం, నీలకురుంజి పుష్పించటం లాంటి పన్నెండేళ్ళకొకసారి జరిగే వేడుకలను ప్రధాని గుర్తు చేశారు. ఈశాన్య భారత ఆధ్యాత్మిక భావనను, వారసత్వ సంపవదను ‘కృష్ణగురు ఏక్ నామ్ అఖండ కీర్తన’ ప్రపంచానికి పరిచయం చేస్తోందన్నారు.
కృష్ణ గురూజీకి సంబంధించిన అసాధారణ జీవిత ఘట్టాలు అసాధారణమైన ప్రతిభ, ఆధ్యాత్మిక సాక్షాత్కారం, మనందరికీ స్ఫూర్తినిస్తాయన్నారు. ఆయన బోధనాల ప్రకారం ఏ వ్యక్తీ పెద్దవాడు, చిన్నవాడు అనే తేడా చూపించలేం. అదే స్ఫూర్తితో దేశం ప్రతి ఒకరినీ సమానంగా చూస్తూ అందరినీ ముందుకు నడిపించేలా సబ్ కా సాథ్ నినాదంత అందరి అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ఇప్పటిదాకా బాగా వెనుకబడిన, నిర్లక్ష్యానికి గురైన వారికే దేశం అత్యంత ప్రాధాన్యమిస్తుందని చెబుతూ, ‘అట్టడుగువర్గాలకు ప్రాధాన్యం’ లో భాగంగా అస్సాం, ఈశాన్య భారతానికి ప్రాధాన్యం అన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దశాబ్దాల తరబడి నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతాలకు ఇప్పుడు ప్రాధాన్యమిస్తున్నామన్నారు.
ప్రధాని ఈ ఏడాది బడ్జెట్ ను ప్రస్తావిస్తూ, ఇదే ధోరణి బడ్జెట్ లోనూ కనబడుతుందన్నారు. ఈశాన్య రాష్ట్రాల ఆదాయంలో పర్యాటక రంగం పోషించే కీలకపాత్ర గురించి మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో 50 పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయటానికి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించామన్నారు. త్వరలో అస్సాం చేరుకోబోతున్న గంగా విలాస్ క్రూయిజ్ గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. భారతదేశపు అత్యంత విలువైన భారత వారసత్వ సాంస్కృతిక సంపద నదీతీరంలోనే ఉందని గుర్తు చేశారు.
సంప్రదాయ హస్త కళలలో నైపుణ్యమున్న వారి కోసం కృష్ణగురు సేవాశ్రం చేస్తున్న కృషిని కూడా ప్రధాని ప్రస్తావించారు. దేశం గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈ రకమైన కృషి ద్వారా సంప్రదాయ నైపుణ్యాలను ప్రోత్సహించటంతోబాటు అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానం చేస్తోందన్నారు. వెదురు విషయంలో దానిని చెట్టు నుంచి గడ్డి విభాగంలోకి మార్చటం ద్వారా వెదురు వ్యాపారానికి కొత్త అవకాశాలు కల్పించినట్టయింది. ఈ బడ్జెట్ లో ప్రతిపాదించిన ‘యూనిటీ మాల్స్’ వలన అస్సాం రైతులు, యువత, హస్త కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించటం ద్వారా లబ్ధిపొందే అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలలోనూ, పెద్ద పెద్ద యాత్రా స్థలాల్లోనూ ప్రదర్శించే అవకాశం ఉందన్నారు. అస్సాం మహిళల కఠోర శ్రమకు ప్రతిబింబమైన గమోసా పట్ల తన అభిమానాన్ని కూడా ప్రధాని చాటుకున్నారు. గమోసా, స్వయం సహాయక బృందాలు ఇప్పుడు పెరుగుతున్న డిమాండ్ కు దీటుగా తయారయ్యాయన్నారు. ఈ స్వయం సహాయక బృందాల కోసం, వారిఊ స్వావలంబన దిశగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం ప్రవేశపెట్టటాన్ని గుర్తు చేశారు. పిఎం ఆవాస్ యోజన కేటాయింపులు 70 వేల కోట్లకు పెంచామని, ఈ పథకం కింద కట్టిన ఇళ్ళు మహిళల పేర్లమీదనే ఉన్నాయని గుర్తుచేశారు. “బడ్జెట్లో అలాంటివి ఎన్నో ఉన్నాయి. ఈశాన్య ప్రాంతంలోని అస్సాం, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ కు చెందిన మహిళలు పెద్ద ఎత్తున లబ్ధిపొందే అవకాశముంది” అన్నారు.
కృష్ణ గురు బోధనలను ప్రస్తావిస్తూ, ఆత్మ సాక్షిగా వ్యవహరించాలని, అన్నీ పనులూ చిత్తశుద్ధితో చేయాలన్న మాటలకు కట్టుబడాలని సూచించారు. ఈ సంస్థ చేపట్టిన సేవాయజ్ఞం లాంటి కార్యక్రమాలు దేశానికి ఎంతో బలం చేకూరుస్తాయన్నారు. ప్రజల భాగస్వామ్యంతో విజయవంతమైన స్వచ్చ భారత్, డిజిటల్ ఇండియా తదితర అనేక పథకాలను గుర్తుచేస్తూ, బేటీ బచావో- బేటీ పడావో , పోషణ్ అభియాన్, ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, యోగా, ఆయుర్వేద లాంటివి విజయవంతం కావటంలోప కృష్ణయగురు సేవాశ్రమ్ కు కీలకమైన పాత్ర ఉందన్నారు.
సంప్రదాయ హస్త కళాకారుల కోసం ‘పిఎం విశ్వ కర్మ కౌశల యోజన’ ను ప్రారంభిస్తోందని, దీనివల్ల సంప్రదాయ హస్త కళాకారులు ప్రయోజనం పొందుతారని ప్రధాని అన్నారు. ఈ పథకం గురించి విస్తృతంగా ప్రచారం చేయటంలో సేవాశ్రం చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఇటీవలే శ్రీ అన్న గా పేరుపెట్టిన ముతక ధాన్యాల గురించి ప్రచారం కల్పిస్తూ ప్రసాదాన్ని కూడా ఈ ధాన్యంతోనే తయారు చేయాలని కోరారు. సేవాశ్రం తన ప్రచురణల ద్వారా స్వాతంత్ర్య సమర యోధుల గురించి కొత్త తరానికి తెలియజేయటానికి కృషి చేయాలన్నారు. ప్రధాని తన ప్రసంగం ముగిస్తూ, మళ్ళీ 12 ఏళ్ల తరువాత జరిగే అఖిలాండ కీర్తన నాటికి మరింత సాధికారత పొందిన భారత్ ను చూస్తామన్నారు.
నేపథ్యం
పరమ గురు కృష్ణగురు ఈశ్వర్ 1974 లో అస్సాంలోని బారపేట దగ్గర నశాట్రా గ్రామంలో కృష్ణయగురు సేవాశ్రం నెలకొల్పారు. సుప్రసిద్ధ వైష్ణవ సాధువు శ్రీ శంకరదేవ అనుచరుడైన మహావైష్ణవ్ మనోహరదేవ 9 వ వారసుడు ఆయన. జనవరి 6 నుంచి కృష్ణగురు సేవాశ్రంలో కృష్ణ గురు ఏక్ నామ్ అఖండ కీర్తన నెలరోజులపాటు జరిగింది.
***
Addressing Krishnaguru Eknaam Akhanda Kirtan for World Peace being held in Assam. https://t.co/mmUKF7KhvE
— Narendra Modi (@narendramodi) February 3, 2023
कृष्णगुरु जी ने विश्व शांति के लिए हर 12 वर्ष में 1 मास के अखंड नामजप और कीर्तन का अनुष्ठान शुरू किया था।
— PMO India (@PMOIndia) February 3, 2023
हमारे देश में तो 12 वर्ष की अवधि पर इस तरह के आयोजनों की प्राचीन परंपरा रही है। pic.twitter.com/rpOGp2FB3U
आज विकास की दौड़ में जो जितना पीछे है, देश के लिए वो उतनी ही पहली प्राथमिकता है। pic.twitter.com/h8Rh64PpVp
— PMO India (@PMOIndia) February 3, 2023
पूर्वोत्तर की इकॉनमी और प्रगति में पर्यटन की एक बड़ी भूमिका है। pic.twitter.com/r1vOw9QBob
— PMO India (@PMOIndia) February 3, 2023
बीते 8-9 वर्षों में देश में गोमोशा को लेकर आकर्षण बढ़ा है, तो उसकी मांग भी बढ़ी है। pic.twitter.com/hLaapBHUL7
— PMO India (@PMOIndia) February 3, 2023
देश की कल्याणकारी योजनाओं की प्राणवायु, समाज की शक्ति और जन भागीदारी है। pic.twitter.com/eqZZ269ifD
— PMO India (@PMOIndia) February 3, 2023
2023 में भारत की पहल पर पूरा विश्व मिलेट ईयर भी मना रहा है।
— PMO India (@PMOIndia) February 3, 2023
मिलेट यानी, मोटे अनाजों को अब एक नई पहचान दी गई है।
ये पहचान है- श्री अन्न। pic.twitter.com/3mj6toUEGy
কৃষ্ণগুৰু একনাম অখণ্ড কীৰ্ত্তনে বিশ্বক উত্তৰ-পূবৰ ঐতিহ্য আৰু আধ্যাত্মিক চেতনাৰ সৈতে পৰিচয় কৰাই দিছে pic.twitter.com/wZg3AFu1ZG
— Narendra Modi (@narendramodi) February 3, 2023
কোনো কাম বা ব্যক্তি সৰু বা ডাঙৰ নহয়, এয়া কৃষ্ণগুৰুজীয়ে শিকাইছে। যোৱা ৮-৯ বছৰ ধৰি দেশখনে এই মনোভাৱ অনুসৰি সকলোৰে উন্নয়নৰ বাবে কাম কৰি আহিছে। pic.twitter.com/mIWv6Fz5uF
— Narendra Modi (@narendramodi) February 3, 2023
অসমকে ধৰি সমগ্ৰ উত্তৰ-পূৰ্বাঞ্চলৰ সামগ্ৰীসমূহক গোলকীয় স্বীকৃতি দিয়াৰ বাবে আজি নিৰন্তৰে প্ৰচেষ্টা চলি আছে। এইবাৰ বাজেটতো এই বিষয়ে গুৰুত্ব প্ৰদান কৰা হৈছে ৷ pic.twitter.com/VDiwBvJ7Qz
— Narendra Modi (@narendramodi) February 3, 2023
कृष्णगुरु एकनाम अखंड कीर्तन पूर्वोत्तर की विरासत और आध्यात्मिक चेतना से विश्व को परिचित करा रहा है। pic.twitter.com/rdgUcScDWa
— Narendra Modi (@narendramodi) February 3, 2023
नए बजट में ऐसे अनेक प्रावधान हैं, जिनसे पूर्वोत्तर की महिलाओं को भी बहुत लाभ होगा और उनके लिए नए अवसर बनेंगे। pic.twitter.com/fO03TipZtF
— Narendra Modi (@narendramodi) February 3, 2023