Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రపంచ రంగస్థలంపై భారతీయ సంస్కృతిని ప్రోత్సహించినందుకు జర్మన్ గాయని కాస్‌మాయికి ప్రధానమంత్రి ప్రశంసలు


ప్రపంచ రంగస్థలంపై భారతీయ సంస్కృతిని ప్రోత్సహించినందుకు జర్మన్ గాయని కాస్‌మాయిని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రశంసించారు.

సాంస్కృతిక ఆదాన, ప్రదానాలను ప్రోత్సహించడంలో కాస్‌మాయి వంటి వారు అసాధారణ పాత్రను పోషించారని శ్రీ మోదీ అన్నారు. అంకితభావంతో కూడిన కృషితో, ఆమె అనేక మందితో కలిసికట్టుగా భారత వారసత్వ వైవిధ్యాన్ని, గాఢతను, సంపన్నతను చాటిచెప్పడంలో సాయపడ్డారని ఆయన అన్నారు.  

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ 

‘‘భారతీయ సంస్కృతి పట్ల ప్రపంచంలో ఆసక్తి అంతకంతకు పెరుగుతోంది. కాస్‌మాయి వంటి వారు ఈ తరహా సాంస్కృతిక ఆదాన, ప్రదానాలను ప్రోత్సహించడంలో అసాధారణ పాత్రను పోషించారు. ఆమె అనేక మంది ఇతరులతో కలిసి అంకితభావంతో కృషి చేసి,  భారత వారసత్వ బహుముఖత్వాన్ని, గాఢతను, సంపన్నతను చాటిచెప్పడంలో సాయపడ్డారు. #MannKiBaat” అని పేర్కొన్నారు. 

 

 

“Weltweite Neugier auf die indische Kultur wächst weiter, und Menschen wie CassMae haben eine wichtige Rolle dabei gespielt, diesen kulturellen Austausch zu fördern. Durch ihren engagierten Einsatz hat sie zusammen mit anderen dazu beigetragen, den Reichtum, die Tiefe und die Vielfalt des indischen Kulturerbes zu präsentieren.”

 

 

***

MJPS/ST