Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రపంచ జల దినోత్సవం నేపథ్యంలో జల సంరక్షణపై నిబద్ధతను పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి


ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా జల సంరక్షణ కర్తవ్య నిర్వహణతోపాటు

సుస్థిర ప్రగతిని ప్రోత్సహించడంపై భారత్‌ నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ

నరేంద్ర మోదీ ఇవాళ పునరుద్ఘాటించారు. మానవ నాగరకతలో నీటికిగల కీలక

పాత్రను స్పష్టం చేస్తూ- భవిష్యత్తరాల కోసం ఈ అమూల్య వనరును

సంరక్షించడానికి సమష్టి కార్యాచరణ అవశ్యమని ఆయన పిలుపునిచ్చారు.

 

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

 

“ఈ రోజు ప్రపంచ జల దినోత్సవం నేపథ్యంలో జల సంరక్షణ, సుస్థిర ప్రగతికి

ప్రోత్సాహంపై మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. ప్రపంచ నాగరకతలన్నిటికీ

నీరు జీవనాడి.. కాబట్టి, భవిష్యత్తరాల కోసం ఈ అమూల్య వనరును సంరక్షించడం

అత్యంత అవశ్యం!” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.