Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రపంచ జల దినం సందర్భంగా ప్రతి నీటి బొట్టునూ కాపాడతామని ప్రతిజ్ఞ చేయవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ జల దినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్క నీటి బొట్టునూ కాపాడతామని ప్రతిజ్ఞ చేయవలసిలందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

“ప్రపంచ జల దినం సందర్భంగా ప్రతి ఒక్క నీటి చుక్కనూ సంరక్షించుకొందామని ప్రతిజ్ఞ చేద్దాం. జన శక్తి వారి మనసులో ధృఢ సంకల్పం చెప్పుకున్నపుడు, మనం జల శక్తి ని సంరక్షించుకోవడంలో కృత‌కృత్యులం కాగలం.

ఈ సంవత్సరం, ఐక్య రాజ్య సమితి ఒక సక్రమమైన అంశాన్నే ఎంచుకుంది.. అదే వ్యర్ధజలం. నీటి పునర్వినియోగం గురించిన అవగాహనను పెంపొందించేందుకే కాకుండా మన ధరిత్రి మనుగడకు జలం ఎందుకు నిత్యావసరమో మనం గ్రహించేందుకు కూడా ఇది తోడ్పడగలదు” అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తమ సందేశంలో పేర్కొన్నారు.