Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రపంచ క్రికెట్ కప్ తుది పోరు నేపథ్యంలో భారత జట్టుకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు


ప్రపంచ క్రికెట్ కప్ తుది పోరు నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.

   ఈ టోర్నమెంటులో ఆదినుంచీ తిరుగులేని విజయాలతో దూసుకువచ్చిన భారత జట్టు ఇవాళ టైటిల్ కోసం ఆస్ట్రేలియా జట్టుతో తలపడుతోంది.

ఈ మేరకు’ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో: 

“టీం ఇండియాకు శుభాకాంక్షలు! దేశంలోని 140 కోట్లమంది భారతీయులు మీ వెన్నంటి నడుస్తూ శుభాశీస్సులు పలుకుతున్నారు. క్రీడా స్ఫూర్తిని చాటుతూ అత్యుత్తమ ప్రతిభతో చక్కగా ఆడి, విజయం సాధించాలని కోరుకుంటున్నారు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

***

DS/SKS