ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి ప్రభావాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసించారు. గీత పట్ల, వేదాంతం పట్ల మక్కువను పెంచుకొన్న శ్రీ జోనస్ మసెటీని ప్రధాని అభినందించారు. శ్రీ జోనస్ మసెటీ బృందం రామాయణంపై ఒక ప్రదర్శనను సంస్కృత భాషలో సమర్పించగా, ఆ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి తిలకించారు. అనంతరం కళాకారులతో సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘శ్రీ జోనస్ మసెటీని, ఆయన జట్టు సభ్యులను కలుసుకొన్నాను. వేదాంతం అంటేనూ, గీత అంటేనూ ఆయనకు ఎంత అభిమానం ఉందో అనే విషయాన్ని #MannKiBaat (‘మన్ కీ బాత్’ ..మనసులో మాట) కార్యక్రమాల పరంపరలోని ఒక కార్యక్రమంలో నేను ఇప్పటికే ప్రస్తావించి ఉన్నాను. రామాయణం సన్నివేశాలను కొన్నింటిని ఆయన బృందం సంస్కృత భాషలో సమర్పించింది. ప్రపంచ దేశాల్లో భారతీయ సంస్కృతి ప్రభావం ప్రశంసనీయం’’.
Met Jonas Masetti and his team. I had mentioned him during one of the #MannKiBaat programmes for his passion towards Vedanta and the Gita. His team presented glimpses of the Ramayan in Sanskrit. It is commendable how Indian culture is making an impact all over the world. pic.twitter.com/4Voy0OKt9X
— Narendra Modi (@narendramodi) November 20, 2024