Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి 2023 జులై 13 నుండి 15 మధ్య కాలం లో ఫ్రాన్స్ను మరియు యుఎఇ ని సందర్శించనున్నారు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జులై 13 వ తేదీ మొదలుకొని 15 వ తేదీ మధ్య కాలం లో ఫ్రాన్స్ లో మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఇఎ) లో ఆధికారిక సందర్శన ను చేపట్టనున్నారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్ ఆహ్వానించిన మీదట ప్రధాన మంత్రి 2023 జూలై 13 వ మరియు 14 వ తేదీ లలో పేరిస్ ను సందర్శించనున్నారు. ప్రధాన మంత్రి 2023 జూలై 14 వ తేదీ నాడు బేస్టిల్ డే పరేడ్ లో గౌరవ అతిథి గా పాలుపంచుకొంటారు. ఈ పరేడ్ లో త్రివిధ దళాల కు చెందిన భారతీయ సాయుధ బలగాల దళమొకటి సైతం పాల్గొంటుంది.

అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్ తో ప్రధాన మంత్రి ఆనవాయితీ గల చర్చల ను జరుపుతారు. ప్రధాన మంత్రి గౌరవార్థం అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్ ఒక ఆధికారిక విందు కార్యక్రమాని కి, అలాగే ఒక ఆంతరంగిక రాత్రి భోజన కార్యక్రమాని కి కూడాను ఆతిథేయి గా వ్యవహరిస్తారు.

ప్రధాన మంత్రి తన యాత్ర లో ఫ్రాన్స్ ప్రధాని తో పాటు ఫ్రాన్స్ యొక్క సీనెట్ మరియు నేశనల్ అసెంబ్లీ ల అధ్యక్షుల తోనూ భేటీ కానున్నారు. ఆయన ఫ్రాన్స్ లోని భారతీయ ప్రవాసుల తో, భారతదేశాని కి చెందిన మరియు ఫ్రాన్స్ కు చెందిన కంపెనీల ముఖ్య కార్యనిర్వహణ అధికారుల (సిఇఒ స్)తో, అలాగే ఫ్రాన్స్ లోని ప్రముఖ వ్యక్తుల తో విడివిడి గా సంభాషిస్తారు.

ఈ సంవత్సరం లో భారతదేశం-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాని కి 25 వ వార్షికోత్సవం. మరి ప్రధాన మంత్రి యొక్క ఈ యాత్ర వ్యూహాత్మక, సాంస్కృతిక, విజ్ఞాన శాస్త్రపరమైన విద్య సంబంధ సహకారం మరియు ఆర్థిక సహకారం వంటి విభిన్న రంగాల లో భవిష్యత్తు ను దృష్టి లో పెట్టుకొని భాగస్వామ్యం ఏ రీతి న సాగాలో రూపురేఖల ను తయారు చేసే అవకాశాన్ని అందిస్తున్నది.

ప్రధాన మంత్రి అటు తరువాత జూలై 15 వ తేదీ నాడు అబూ ధాబీ ని సందర్శిస్తారు. యుఎఇ అద్యక్షుడు శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ తో ప్రధాన మంత్రి కలసి చర్చ లు జరుపుతారు. భారతదేశం-యుఎఇ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం నిలకడ గా బలపడుతూ వస్తున్నది, మరి ప్రధాన మంత్రి యొక్క ఈ సందర్శన అనేది శక్తి, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆహార సురక్ష, పిన్ టెక్, రక్షణ, మరియు సంస్కృతి ల వంటి వివిధ రంగాల లో ఈ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకు పోయే సాధనాల ను గుర్తించడాని కి ఒక అవకాశాన్ని ఇవ్వనుంది. ఈ సందర్శన ప్రపంచ అంశాల లో, మరీ ముఖ్యం గా యుఎన్ఎఫ్ సిసిసి యొక్క సిఒపి-28 లో యుఎఇ అధ్యక్షత మరియు యుఎఇ ఒక విశేష ఆహ్వానిత సభ్యత్వదేశం గా ఉంటున్న జి-20 లో భారతదేశం అధ్యక్షత నేపథ్యాల లో సహకారాన్ని నెలకొల్పుకొనే విషయం పై చర్చించే అవకాశాన్ని కూడా ఇవ్వనుంది.

***