Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవ్ రోజ్ శుభాకాంక్షలు


పార్సీ నూతన సంవత్సరాది పండుగ రోజు ‘నవ్ రోజ్’ ఈ రోజు కావడంతో అందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ పర్వదినం ఆనందాన్ని, జయాన్ని, అద్భుతమైన ఆరోగ్యాన్ని సమృద్ధిగా ప్రసాదిస్తుంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో:

‘‘పారసీ నూతన సంవత్సరాది ప్రతి ఒక్కరికీ చాలా సంతోషాన్ని ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాను! ఆనందాన్ని, జయాన్ని, చక్కనైన ఆరోగ్యాన్ని ఈ నవ్ రోజ్ సమృద్ధిగా ప్రసాదించుగాక. మన సమాజంలో సోదరత్వం నిరంతరం గాఢతరమవుతూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. నవ్ రోజ్ ముబారక్. (నవ్ రోజ్ శుభాకాంక్షలు.)’’ అని పేర్కొన్నారు.