మారిశస్ యొక్క ప్రధాని శ్రీ ప్రవింద్ కె. జుగ్‌నాథ్ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మాట్లాడి శ్రీ నరేంద్ర మోదీ కి అభినందనల ను తెలిపారు. ప్రధాన మంత్రి గా చరిత్రాత్మకమైన రీతి లో వరుసగా మూడో సారి గెలుపు ను సాధించినందుకు గాను శ్రీ నరేంద్ర మోదీ కి ప్రధాని శ్రీ ప్రవింద్ జుగ్‌నాథ్ అభినందనల ను వ్యక్తం చేయడం తో పాటుగా ఈ గెలుపు ప్రపంచం లో అతి ప్రజాస్వామ్యం పక్షాన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క నాయకత్వం పట్ల వ్యక్తం అయిన విశ్వాసానికి ఒక నిదర్శన గా ఉంది అని కూడా అన్నారు. దీనికి తోడు, ప్రపంచం లో కెల్లా అతి పెద్దది అయినటువంటి ప్రజాస్వామిక ప్రక్రియ ను ఫలప్రదం గాను మరియు ప్రేరణాత్మకం గాను ఆచరించినందుకు కూడాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి అభినందనల ను శ్రీ ప్రవింద్ జగన్నాథ్ తెలియ జేశారు.
ప్రధాని శ్రీ ప్రవింద్ కె. జగన్నాథ్ కు ధన్యవాదాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు. భారతదేశాని కి మరియు మారిశస్ కు మధ్య గల విశిష్ట సంబంధాల ను మరింత గా దృఢపరచుకోవడం కోసం, అన్ని రంగాల లో చాలా కాలం గా కొనసాగుతున్నటువంటి ద్వైపాక్షిక సహకారాన్ని విస్తృత పరచుకోవడం సహా రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాల ను విస్తృతం చేయడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన వచనబద్ధత ను కొనసాగించగలనని పునరుద్ఘాటించారు.
***