Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తోసమావేశమైన ఇజ్ రాయల్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఇజ్ రాయల్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ఎలీ కోహెన్ ఈ రోజు న సమావేశమయ్యారు.

 

వారు ద్వైపాక్షిక సహకారాని కి సంబంధించిన అనేక అంశాల ను చర్చించారు. ఆ అంశాల లో వ్యవసాయం, జలం, నూతన ఆవిష్కరణలు మరియు రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల యొక్క విస్తృత శ్రేణి పూరకాల లో విజ్ఞాన ప్రధానమైనటువంటి భాగస్వామ్యాన్ని వినియోగించుకోవడం సహా ప్రజల పరస్పర సంబంధాల ను పటిష్ట పరచడం వంటివి భాగం గా ఉన్నాయి.

 

వారు పరస్పర హితం ముడిపడ్డ అనేక ప్రాంతీయ అంశాల ను మరియు అంతర్జాతీయ అంశాల పట్ల ఒకరి అభిప్రాయాల ను మరొకరి దృష్టి కి తీసుకు వచ్చారు కూడాను.

 

ప్రధాని శ్రీ బెంజామిన్ నెతాన్యాహూ కు తన తరఫున హృదయ పూర్వక అభినందనల ను తెలియ జేయవలసింది గా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ఎలీ కోహెన్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోరారు.

 

 

 

**