Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి, వియత్ నామ్ ప్రధాని శ్రీ ఫామ్ మిన్హ్ చిన్ కు మధ్య టెలిఫోన్ ద్వారా జరిగిన సంభాషణ


వియత్ నామ్ ప్రధాని శ్రీ ఫామ్ మిన్హ్ చిన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.

వియత్ నామ్ ప్రధాని పదవి లో శ్రీ ఫామ్ మిన్హ్ చిన్ నియామకం జరిగిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శుభాకాంక్షల ను తెలియజేసి, ఆయన సమర్థ మార్గదర్శకత్వం లో భారతదేశం-వియత్ నామ్ విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్యం ఇక ముందు కూడా పటిష్టం కాగలదనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

దాపరికానికి తావు లేనటువంటి, అన్ని వర్గాలను కలుపుకొని పోయే, శాంతియుతమైన, నియమాలపై ఆధారపడ్డ హిందూ మహాసముద్ర ప్రాంతం పట్ల ఉభయ దేశాలు సమానమైనటువంటి దృష్టికోణాన్ని కలిగివున్నాయన్న తర్కాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతిస్తూ,  ఈ కారణం గా భారతదేశం, వియత్ నామ్ ల మధ్య గల ఈ విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రాంతీయ స్థిరత్వాన్ని, ప్రాంతీయ సమృద్ధి ని, ప్రాంతీయ అభివృద్ధి ని పెంపొందించేలా తమ వంతు తోడ్పాటు ను అందిస్తాయని పేర్కొన్నారు.  భారతదేశం, వియత్ నామ్ లు ప్రస్తుతం ఐక్య రాజ్య సమితి భద్రత మండలి లో సహ సభ్యత్వ దేశాలు గా ఉన్న విషయాన్ని ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావించారు.

భారతదేశం లో కోవిడ్-19 మహమ్మారి తాలూకు సెకండ్ వేవ్ సాగుతున్న ఈ కాలం లో వియత్ నామ్ ప్రభుత్వం ద్వారాను, వియత్ నామ్ ప్రజల ద్వారాను లభించినటువంటి అతి విలువైన సమర్థన కు గాను ప్రధాని శ్రీ ఫామ్ మిన్హ్ చిన్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు.  ఈ విశ్వమారి కి వ్యతిరేకం గా జరుగుతున్న ప్రయాసల ను సమర్థించడానికి ఇరు దేశాలు పరస్పరం సంప్రతింపులను, పరస్పరం సహకారాన్ని కొనసాగించాలి అంటూ నేత లు ఇద్దరూ వారి సమ్మతి ని వెలిబుచ్చారు.

ద్వైపాక్షిక సంబంధాల స్థితి ని ఇరువురు నేత లూ సమీక్షించారు.  వివిధ రంగాల లో వారి వారి ఆలోచనల ను ఒకరి తో మరొకరు వెల్లడి చేసుకొన్నారు.   ఉభయ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2022వ సంవత్సరం లో 50వ వార్షికోత్సవం తటస్థించనుందని, ఈ శుభ సందర్భాన్ని మరపురానిది గా మలచుకోవడం కోసం ఘనమైన పద్ధతి లో పలు ఉత్సవాల ను నిర్వహించాలంటూ నేతలిద్దరూ వారి సమ్మతి ని వ్యక్తం చేశారు.

ప్రధాని శ్రీ ఫామ్ మిన్హ్ చిన్ వీలయినంత త్వరలో భారతదేశ ఆధికారిక సందర్శన కు తరలిరావాలంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు ఆహ్వానం పలికారు.