Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఇస్లామిక్ రిప‌బ్లిక్ ఆఫ్‌ ఇరాన్ విదేశాంగ మంత్రి డాక్టర్ జవ్వాద్ జ‌రీఫ్‌ భేటీ


రైసీనా డైలాగ్ 2020 లో పాలు పంచుకోవడం కోసం భారతదేశాని కి విచ్చేసిన ఇస్లామిక్ రిప‌బ్లిక్ ఆఫ్‌ ఇరాన్ విదేశాంగ మంత్రి డాక్టర్ మొహ‌మ్మ‌ద్ జవ్వాద్ జ‌రీఫ్‌ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు న సమావేశమయ్యారు.

https://lh3.googleusercontent.com/KmmaOIuqh3QeW009z3yPTUxjgP_C__bhH02iYKR8F12sjhL-3rIbEACWVFfnTHadLUynmqC7Ju7GTO_NPV4dszySg31dwtlCqrHblmVHjgCbWA9xSENppTmabuBuom4lOdcwL-Xz

 

భారతదేశం లో డాక్టర్ జరీఫ్ కు ప్రధాన మంత్రి స్వాగతం పలుకుతూ, 2019వ సంవత్సరం సెప్టెంబర్ లో న్యూ యార్క్ లో ఐక్య రాజ్య సమితి సాధారణ సభ సమావేశాలు జరిగిన సందర్భం లో అధ్యక్షుడు శ్రీ రూహానీ తో సౌహార్ద భరిత వాతావరణం లో ఉత్సాహంగా మాట్లాడిన సంగతి ని గుర్తు కు తెచ్చుకొన్నారు.  ఇరాన్ తో భారతదేశం బలమైనటువంటి మరియు మైత్రీ పూర్వకమైనటువంటి సంబంధాల ను వికసింపచేసుకొనేందుకు తన యొక్క వచనబద్ధత ను కొనసాగిస్తుందంటూ ఆయన పునరుద్ఘాటించారు.  చాబహార్ పథకాని కి ప్రత్యేక ఆర్థిక మండలం హోదా ను కల్పించడం సహా ఆ పథకం లో పురోగతి కై ఇరాన్ నాయకత్వం చేస్తున్న కృషి కి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి తమ ప్రాంతం లోని ఇటీవలి పరిణామాల పై తన దృష్టి కోణాన్ని ప్రధాని కి వెల్లడించారు.  ఆ ప్రాంతం లో శాంతి, భద్రత మరియు స్థిరత్వం నెలకొనాలనే ప్రగాఢమైనటువంటి ఆసక్తి ని  భారతదేశం కలిగివుందని ప్రధాన మంత్రి ప్రస్తావించారు.

 

 

**